Sunny Deol: బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ గురించి మనందరికీ తెలిసిందే. మొదటి వరకు వరుసగా సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ డియోల్ ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. గత ఏడాది విడుదల అయిన గదర్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత సన్నీ డియోల్ డిమాండ్ మరింత పెరిగింది. దీంతో ఇప్పుడు సన్నీ డియోల్ కీ వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న రామాయణం సినిమాలో సన్నీడియోల్ కు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటించేందుకు సన్నీ డియోల్ అంగీకరించినట్లు పింక్‌విల్లా నివేదించింది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో మాత్రం భారీ హైప్ నెలకొంది. మరోవైపు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉపయోగించి రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి ఎలా ఉంటారు ? అంటూ ఫోటోస్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అందులో భాగంగానె ఈ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఈ రామాయణ సినిమా చాలా భాగాలుగా రూపొందించనున్నారట. ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటించనున్నారని టాక్ నడుస్తుంది.
హనుమంతుడిగా సన్నీ డియోల్..
అలాగే ఇప్పుడు హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆంజనేయుడి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ పాత్రకు నటీనటులు ఎంపిక విషయంలో చిత్రయూనిట్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే విభీషణుడి పాత్ర కోసం విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయాలపై పూర్తి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…