‘బొమ్మరిల్లు’ సినిమా ఆ ఇద్దరు టాలీవుడ్ స్టార్స్‌తో ఇప్పుడు తీస్తే ఎన్ని వందల కోట్లు రాబట్టేదో తెలుసా ?

టాలీవుడ్‌లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా బొమ్మరిల్లు. నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో వచ్చి భారీ వసూళ్ళు రాబట్టిన సినిమాలలో ఒకటి. తెలుగులో సిద్దార్థ్ కి అసాధారణమైన పాపులారిటీని, క్రేజ్‌ను తీసుకు వచ్చింది. అలాగే ప్రకాశ్ రాజ్‌కి ఫాదర్ రోల్ అంటే ఇలా ఉండాలి అనే పేరు తీసుకు వచ్చింది. ఇప్పటికీ ఎవరైనా బొమ్మరిల్లు ఫాదర్ అని తమ వారిని కంపేర్ చేసుకుంటుంటారు. అలాగే జెనీలియాకి తెలుగులో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తీసుకు వచ్చిన సినిమా. జెనీలియా అంటే తెలుగు ప్రేక్షకులకి హాసిని పాత్ర గుర్తొస్తుంది. జయసుధ కెరీర్‌లో మరో అద్భుతమైన పాత్ర.

ఇలా బొమ్మరిల్లు సినిమా దాదాపు అందరి కెరీర్‌లోనూ గొప్ప సినిమాగా నిలిచింది. కాగా ఈ సినిమా వచ్చి 15ఏళ్లు పూర్తయింది. ఆర్య, భద్ర లాంటి సినిమాలకి దర్శకత్వ శాఖలో పనిచేసి దిల్ రాజు కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకుడు భాస్కర్. మొదటి సినిమా బొమ్మరిల్లు కావడంతో ఆయన ఇంటిపేరు ఏకంగా బొమ్మరిల్లు అయిపోయింది. కొన్ని సినిమాలు కథ, కథనం రాసుకునేటప్పుడు..దానికి సంబంధించిన హీరో, హీరోయిన్స్‌ను ఎంచుకునేటప్పుడు, సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు..ఆఖరికి రిలీజయ్యే ముందు కూడా ఊహించని వసూళ్ళు, రికార్డులు క్రియేట్ చేస్తుందని చిత్రబృందం కూడా అనుకోరు.

అలాంటి సినిమాలలో బొమ్మరిల్లు కూడా ఒకటి. ఈ సినిమా ఇంత భారీ విజయాన్ని అందుకుంటుందని నిర్మాత దిల్ రాజు గానీ, హీరో – హీరోయిన్స్ గానీ, దర్శకుడు గానీ ఊహించలేదు. 15 ఏళ్లు పూర్తయినా కూడా ఇండస్ట్రీలో గానీ, ప్రేక్షకులు గానీ ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే ఈ సినిమాలో ఉన్న సోల్ అలాంటిది. షూటింగ్ అంతా అయ్యాక కూడా ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేశ్ క్లైమాక్స్ లో కొన్ని రియాక్షన్స్ మిస్ అయ్యాయి. అవి సిద్దార్థ్ కి సంబంధించినవి. కంప్లీట్‌గా ప్రకాశ్ రాజ్ మీదే ఫోకస్ చేశారు. ఆయన డైలాగ్స్‌కి సిద్దార్థ్ రియాక్షన్స్ పడితే సినిమా పెద్ద హిట్ అవుతుందని సలహా ఇచ్చాడు.

దాంతో డైరెక్టర్ భాస్కర్ – నిర్మాత దిల్ రాజు మళ్లీ షూట్ పెట్టుకొని ఎడిటర్ చెప్పిన షాట్స్ తీశారు. ఆయన చెప్పినట్టు సినిమా ఇంత సక్సెస్ కావడానికి క్లైమాక్స్ ప్రధాన కారణమైంది. అలాంటి ఈ సినిమాకి సంబంధించి చాలానే ఉన్నాయట. వాస్తవంగా బొమ్మరిల్లు సినిమాను సిద్దార్థ్‌తో కాకుండా మన టాలీవుడ్ హీరోలు ఇద్దరితో చేయాలనుకున్నారట. వాళ్లిద్దరు కాదనడంతో ఫైనల్‌గా సిద్దార్థ్‌ను ట్రై చేశారు. అయితే ఈ కథ రిజెక్ట్ చేసిన ఆ హీరోలు జూనియర్ ఎన్.టి.ఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఇద్దరికి విపరీతమైన మాస్ ఇమేజ్ ఉండటం..బొమ్మరిల్లు కథేమో క్లాస్ కావడంతో నో చెప్పారు.

అయితే ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్.. భాస్కర్‌తో సినిమా చేయకపోయినా అల్లు అర్జున్ మాత్రం వెంటనే ‘పరుగు’ చేశాడు. అయితే అప్పట్లో ఈ సినిమాకి అయిన బడ్జెట్ 7 కోట్లు. 120 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే 105 రోజుల్లో పూర్తి చేశారు. దిల్ రాజు 9 కోట్లకి అమ్మేశాడు. కొన్ని చోట్ల దిల్ రాజు సొంతగా రిలీజ్ చేశాడు. 23కోట్ల షేర్ వసూళ్ళు రాబట్టింది. ఓవర్సీస్ లో 3కోట్లు రాబట్టడం విశేషం. ఇక ఈ సినిమా కథ తగ్గట్టు టైటిల్ ఏదైతే సూటవుతందని దిల్ రాజు ఆలోచిస్తుండగా డైరెక్టర్ వైవిఎస్ చౌదరీ ‘బొమ్మరిల్లు’ అంటూ నిర్మాణ సంస్థను స్థాపించి ‘దేవదాసు’ సినిమాను రూపొందించారు. ఈ పేరు బావుందని అదే టైటిల్ గా ఫిక్స్ చేశారు.

ఇక ఇప్పుడున్న పాన్ ఇండియన్ క్రేజ్‌ను బట్టి జూనియర్ ఎన్.టి.ఆర్ లేదా అల్లు అర్జున్‌తో గనక తీస్తే 100 నుంచి 120 కోట్ల బడ్జెట్ అవుతుందని దాదాపు 300 నుంచి 400 కోట్ల వరకు వసూళ్ళు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్.టి.ఆర్ లేదా అల్లు అర్జున్‌ ల ఇద్దరికీ పాన్ ఇండియన్ స్టార్స్ గా క్రేజ్ ఉంది. అందుకే ఆ మొత్తం వసూళ్ళు రాబడుతుందని చెప్పుకుంటున్నారు. ఇక బొమ్మరిల్లు సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం కూడా ప్రధాన కారణం. ఆయన ఇచ్చిన సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఇక ఇందులో దేవీశ్రీ మార్క్ ఐటెం సాంగ్ లేకపోవడం విశేషం.