త్రివిక్రం బాగా ట్రై చేశాడు.. కానీ పార్వతి మెల్టన్..

మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తన మాటల తూటాలతో హీరోయిజాన్ని ఏ రేంజ్ లో చూపిస్తాడో గ్లామర్ రోల్స్‌లో హీరోయిన్స్ ని కూడా అదే రేంజ్ లో అందంగా చూపించి క్రేజ్ తీసుకు వస్తాడు. క్యారెక్టర్స్ మధ్య రాసుకునే పంచ్ డైలాగులతో పొట్ట చెక్కలయ్యేలా కామెడీ పండిస్తాడు. ఎమోషన్ సీన్స్ విషయంలో సహజత్వం ఉండేలా జాగ్రత్తపడతారు. ఇలా త్రివిక్రం సినిమా అంటే నవరసాలు ఉంటాయి. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తాయి. మిగతా దర్శకుల మాదిరిగా కాకుండా త్రివిక్రం సినిమాలో హీరో ఎంత హైలెట్ అవుతాడో హీరోయిన్ అంతే హైలెట్ అవుతుంది.

కమర్షియల్ ఫార్ములా అంటూ కేవలం పాటలకి మధ్యలో స్కిన్ షో చేయడానికి మాత్రమే అనేట్టుగా త్రివిక్రం హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకోడు. ఈ విషయం ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఇక ఒక్కసారి ఒక హీరోయిన్‌తో సినిమా చేస్తే, వరుసగా ఆమెనే ఆ తర్వాత సినిమాలకి కంటిన్యూ చేస్తాడు అని. ఈ విషయం కూడా త్రివిక్రం సినిమాలను చూసే ప్రతీ ప్రేక్షకుడికి అలా రిపీట్ చేస్తాడనే విషయంలో నెగిటివ్ కామెంట్స్ ఉన్నా కూడా హీరోయిన్‌కి మాత్రం స్టార్ స్టేటస్ తెచ్చిపెడతాడు. సమంతతో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ లాంటి సినిమాలు చేశారు.

ప్రస్తుతం పూజా హెగ్డే ని ఆయన సినిమాలకి రిపీట్ చేస్తున్నాడు. ఇలాగే గతంలో ఇలియానాతో రెండు సినిమాలు చేసిన త్రివిక్రం పార్వతి మెల్టన్ కి స్టార్ స్టేటస్ ఇవ్వాలని చాలా ట్రై చేశాడు. అందుకే ఆమెకి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తీసిన జల్సా సినిమాలో ఇలియానాతో కాస్త అటు ఇటు సమానంగా ఉండే క్యారెక్టర్ ఇచ్చాడు. సాంగ్ కూడా ఉంటుంది. గ్లామర్‌గానూ బాగా చూపించాడు. కానీ పార్వతి మెల్టన్ తన మీదఉన్న నెగిటివ్ టాక్ వల్ల జల్సా సినిమా ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదని చెప్పుకున్నారు. పార్వతి మెల్టన్ కెరీర్ లో హిట్ సినిమా అంటే ఆమె డెబ్యూ సినిమా వెన్నెల.

డీసెంట్ హిట్ అందుకున్న ఈ సినిమా తర్వాత మంచు మోహన్ బాబు – విష్ణు నటించిన గేం అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అల్లరే అల్లరి, మధుమాసం, లాంటి సినిమాలు చేసింది. కానీ ఆమెకి ఇవేవి ఆశింతనంత సక్సెస్ ఇవ్వలేదు. అయినా పార్వతికి మాటల మాంత్రీకుడు అవకాశం ఇచ్చాడు. దాంతో ఆమె కెరీర్ యూ టర్న్ తీసుకుంటుందని అందరూ భావించారు. పవన్ తో ఉన్న సీన్స్ పార్వతికి బాగానే పేరు తీసుకు వచ్చాయి. కానీ మళ్ళీ త్రివిక్రం ఎందుకో పార్వతిని రిపీట్ చేయలేదు. మరో అవకాశం ఇచ్చి ఉంటే ఏమైనా సక్సెస్ ట్రాక్ ఎక్కేదేమో. కానీ అది జరగలేదు.

త్రివిక్రం – పవన్ కళ్యాణ్ సినిమా అంటే నేను స్టార్ హీరోయిన్ అవుతా అని పార్వతి మెల్టన్ కూడా ఆశలు పెట్టుకుంది. కానీ ఆమెకి జల్సా షాక్ ఇచ్చినట్టే అని చెప్పాలి. ఆ తర్వాత దూకుడు సినిమాలో అలా మెరిసింది. బాలయ్యతో శ్రీమన్నారాయణ, యమహో యమా సినిమాలు చేసి అదృష్టం పరీక్షించుకుంది. కానీ ఈ రెండు సినిమాలు పార్వతీ మెల్టన్‌కి హిట్స్ ఇవ్వలేదు.

దాంతో ఈమె ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది.. అయితే ఫేడవుట్ అయిన హీరోయిన్స్‌కి త్రివిక్రం తన సినిమాల ద్వారా రిఎంట్రీ ఇచ్చేలా చేస్తున్నాడు. అలా మళ్ళీ ఏమైనా పార్వాతీ మెల్టన్‌ని త్రివిక్రం తీసుకు వస్తాడేమో చూడాలి.