RRR Movie Tittle: ఆర్ఆర్ఆర్(RRR) టైటిల్ వెనక ఇంత అర్థం దాగి ఉందా.. అర్థాన్ని వివరించిన జక్కన్న!

RRR Movie Tittle: ఆర్ఆర్ఆర్(RRR) టైటిల్ వెనక ఇంత అర్థం దాగి ఉందా.. అర్థాన్ని వివరించిన జక్కన్న!

RRR Movie Tittle: వచ్చే సంవత్సరం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను లెజెండరీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించగా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. అయితే భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. దాదాపు రూ. 500 కోట్లకు పైగా ఖర్చు అయ్యాయట.

RRR Movie Tittle: ఆర్ఆర్ఆర్(RRR) టైటిల్ వెనక ఇంత అర్థం దాగి ఉందా.. అర్థాన్ని వివరించిన జక్కన్న!
RRR Movie Tittle: ఆర్ఆర్ఆర్(RRR) టైటిల్ వెనక ఇంత అర్థం దాగి ఉందా.. అర్థాన్ని వివరించిన జక్కన్న!

పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్లో బిజీగా ఉంది. ఇటీవల ముంబై, చెన్నై, తిరువనంతపురం నగరాలను చుట్టేశారు. వరుస ఇంటర్వ్యూలతో మూవీ టీం ఫుల్‌ బిజీగా ఉంది. తాజాగా ”ది కపిల్‌ శర్మ షో” లో పాల్గొన్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ వెనుకున్న సీక్రెట్‌ను రివీల్‌ చేశారు.

RRR Movie Tittle: ఆర్ఆర్ఆర్(RRR) టైటిల్ వెనక ఇంత అర్థం దాగి ఉందా.. అర్థాన్ని వివరించిన జక్కన్న!

ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఏ టైటిల్‌ పెట్టాలో అర్థం కాలేదు. దీంతో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి ఇలా ముగ్గురి పేర్లు కలిసేలా ఆర్‌ఆర్‌ఆర్‌ అనుకున్నాం. సోషల్‌ మీడియాలో కూడా ఆ పేరుతోనే అప్‌డేట్స్‌ ఇచ్చాం. దీంతో ఈ కాంబినేషన్ పేరుకు మేము అనుకున్న దాని కంటే కూడా ఎక్కువగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. దీంతో ఇదే పేరును పెట్టాలని డిసైడ్ అయ్యామన్నారు.

RRR హ్యాష్‌ట్యాగ్‌తోనే సినిమాకు..

ఇక వాటికి సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఎమోషన్లను దృష్టిలో పెట్టుకొని.. ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే రౌద్రం, రణం, రుధిరం’ అని పెట్టామన్నారు. అలా #RRR హ్యాష్‌ట్యాగ్‌తోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇచ్చి.. ఇదే టైటిల్ ను చివరకు సినిమాకు పెట్టామన్నారు. ఈ సినిమా వాయిదా పడుతుందనే విషయంపైనా ఆయన స్పందించారు. విడుదల తేదీలో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేశారు. బయట వచ్చే పుకార్లను ఏ మాత్రం నమ్మెద్దన్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమురం భీమ్‌గా కనిపించనున్న విషయం విధితమే. శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు.