Ap Politics: అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఎంత ప్రమాదమో భవిష్యత్తులో తెలుస్తాయి: శ్రవణ్ కుమార్

Ap Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్‌ కుమార్‌ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసిపి పార్టీ కార్యాలయాలను కూల్చివేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఆయన రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని అని ప్రభుత్వ కార్యాలయాలను పడగొట్టడానికా కూటమికి అధికారం ఇచ్చిందని ప్రశ్నించారు.

ఏవైనా భవనాలను కూల్చాలనుకుంటే కోర్టు ఆర్డర్‌తో కూల్చండి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కరెక్ట్‌ కాదు. రూల్‌ ఆఫ్‌ లాను టీడీపీ ఉల్లంఘిస్తోంది. పార్టీ ఆఫీసులకు అనుమతి లేదని అధికారులకు ఇప్పుడు గుర్తొచ్చిందా.. అధికారులు ఏ ప్రభుత్వము అధికారంలో ఉంటే వారికి కొమ్ము కాయడం సరికాదని ఈయన తెలిపారు. కోర్టు అనుమతి లేకుండా ఏ బిల్డింగులను కూడా కూల్చి వేయకూడదు అంతేకాకుండా కరకట్టపై ఉన్న బిల్డింగులకు ఏ ఒక్క బిల్డింగ్ కైనా అనుమతి ఉందా అంటూ ఈయన ప్రశ్నించారు.

2029 ఎన్నికలలో తెలుస్తుంది..
కరకట్ట మీద ఉన్న బిల్డింగ్స్ పడగొట్టాలని కోర్టులో పిటిషన్‌ వేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను కూడా ఈయన ఖండించారు. అంతేకాకుండా అచ్చం నాయుడు ఇటీవల అధికారుల గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై ఈయన స్పందించారు.అచ్చెన్నాయుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఎంత ప్రమాదకరమో 2029 ఎన్నికలో ఆయనకు తెలుస్తుంది. అధికారులను అరెస్ట్ చేయాలి. కలెక్టర్లను టార్గెట్ చేయాలి అనేవి మానుకోవాలి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేయాలి, తరిమేయాలని అనుకుంటే కుదరదు. ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రజల ఆలోచనలకు కూడా విలువ ఇవ్వాలంటూ ఈ సందర్భంగా జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.