YS Jagan: నెల్లూరు జైలుకు వైయస్ జగన్.. ఆ వైసీపీ నేతతో మూలఖత్?

YS Jagan: వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జులై 4వ తేదీ నెల్లూరు జైలుకు వెళ్లబోతున్నారు. నెల్లూరు జైలులో రిమాండ్ లో ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈయన పరామర్శించడానికి వెళ్తున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే పిల్లలతో ఇప్పటికే కొంతమంది వైసీపీ కీలక నేతలు మూలాఖత్ అయ్యారు. అయితే తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో విజయం తమదేనని చాలా ధీమా వ్యక్తం చేశారు కానీ ఫలితాలు ఊహించిన విధంగా రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ విషయం నుంచి ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారని తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను తిరిగి పరామర్శించడానికి అలాగే ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని కేడర్ కి సూచించడమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉండాలని కూడా తెలిపారు.

పిన్నెల్లితో మూలాఖత్…

ఇక త్వరలోనే తాను ప్రజలలోకి రాబోతున్నానని జగన్ వెల్లడించారు. ఈ తరుణంలోనే ముందుగా అరెస్టయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈయన పరామర్శించబోతున్నారు. ఇన్ని రోజులపాటు బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటీవల తాడేపల్లికి చేరుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక తాడేపల్లి నుంచి నేరుగా నెల్లూరుకు హెలికాప్టర్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన జైలుకు వెళ్లబోతున్నారు.