AP politics: పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్!

AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.

ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.

ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.

పొత్తు ధర్మాన్ని పాటించండి..
ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.