Jayaprada : అడవి రాముడు సినిమాలోని.. ఆ పాటలో ఎన్టీఆర్ కొట్టుడుకు నాకు మూడు రోజులు నొప్పులు, జ్వరం. : జయప్రద.

Jayaprada : అడవిరామడు 1977లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఎన్.టి.ఆర్, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ ల్ వచ్చిన తొలిచిత్రం. ఇది సత్యచిత్ర వారి మూడవ చిత్రం (గతంలో ఈ సంస్థ ద్వారా తాసిల్దార్ గారి అమ్మాయి, ప్రేమబంధం చిత్రాలు నిర్మితమయ్యాయి). జయప్రద – రామారావు జంటకు తొలి చిత్రం. తెలుగు సినిమాలలో కథ, కథనం, సంగీతం, స్టెప్పులు ఈ చిత్రం మొదలు పెట్టిన ఒరవడిలో చాలాకాలం సాగాయి.

కన్నడ రాజ్ కుమార్ నటంచిన “గంధద గుడి” చిత్రం ఈ చిత్రానికి కొంత ఆధారం. అప్పటి వరకు ఉన్న రామారావు ఇమేజిని మారుస్తూ, ఆహార్యం, దుస్తులు మార్పులు చేసి రాఘవేంద్రరావు కొత్త రామారావును చూపించారు. తొలిసారిగా విజయవాడ యాక్స్ టైలర్స్ రామారావు దుస్తులు రూపకల్పన చేసారు. రామారావు ఇంట్రడక్షన్ నుండి హీరోఇజమ్ ప్రదర్శితమౌతూ వస్తుంది. అప్పటి సూపర్ హిట్ హిందీ చిత్రం షోలే లోని కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉపయోగించుకున్నారు. రోహిణిని విలన్ల చంపడం, రామును గూడెం నుండి వెళ్ళిపొమ్మని శ్రీధర్ బెదిరించే సన్నివేశం,కాకరాల రామారావును అక్కడే ఉండమనడం, జయప్రద రాము కోసం గుడిలో ప్రార్ధించడం, జయసుధ వెనకనుండి మాట్లాడటం, జయసుధ, జయప్రదలనుగుర్రపు బండిమీద సత్యనారాయణ వెంటాడటం షోలే నుండి తీసుకున్నవే.

చిత్రంలో పాటలన్నీ జనరంజకమైనవే. వేటూరి ఈ చిత్రంలో అన్ని పాటలూ వ్రాసారు. ఈ సినిమాలో పాటలు ఆంధ్రనాట చాలా ప్రస్సిద్ధి పొందాయి. ఈ పాటలు చాలా కాలం తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాలలో నిలిచిపోవడం గమనార్హం. అయితే జయప్రద ఒక కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన ఆమె అడవి రాముడు చిత్రానికి సంబంధించిన విశేషాలను చెప్పుకొచ్చారు… ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా “ఆరేసుకోబోయి పారేసుకున్నాను..ఆ ఒక్క పాట కోసం ప్రేక్షకులు మళ్లీమళ్లీ అడవి రాముడు సినిమాకి వెళ్లారు.

ఆ పాట చిత్రీకరణ మధుమలై ఫారెస్ట్ లో జరుగుతున్న సమయంలో.. అక్కడికి ఒక చెవిటి ఏనుగు వచ్చింది. ఎంత అరిచినా దానికి వినబడదు. ఎన్టీఆర్ గారు అలా స్తబ్దుగా కూర్చుని ఎలాంటి అసహనానికి గాని ఆగ్రహానికి గాని ఆయన రాలేదు. మేము ఆ ఏనుగు వెళ్ళిపోయే వరకు కొన్ని గంటలు ఓపికగా వేచిఉన్నాం.తిరిగి అక్కడి నుంచి ఆ ఏనుగు వెళ్లిపోవడంతో మేమంతా షూటింగ్ లో పాల్గొన్నాం. ఆపాటలో ఎన్టీఆర్ గారు నా వెనుక నుంచి కొట్టుకుంటూ.. పాట పాడుతూ ఉంటారు. ఎంతో కష్టపడి ఆ పాటను ఎలాగో అలాగా పూర్తి చేశాం. ఆ తర్వాత నాకు ఒకటే నొప్పులు,జ్వరం కూడా.. మూడు రోజుల వరకు నేను సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు. అడవిరాముడు సినిమా విడుదలై సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు పడిన కష్టాలన్నీ మర్చిపోయామంటూ ఆ ఇంటర్వ్యూలో జయప్రద వివరించారు.