Jayaprakash Reddy : అమ్రిష్ పురిని అడిగారు.. నానా పటేకర్ కోటిన్నర డిమాండ్ చేశారు. చివరికి నన్ను సెలెక్ట్ చేశారు. : జయప్రకాశ్ రెడ్డి.

Jayaprakash Reddy : ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి అప్పట్లో.. ఓ నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావు కు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. అప్పుడు హైదరాబాదులో రామానాయుడు, అతని కుటుంబసభ్యుల ముందు ఆ నాటకాన్ని ప్రదర్శించాడు. అలా ఈయన 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు. అప్పటినుండి 1992 వరకు 25 సినిమాల్లో నటించాడు. కానీ ఆర్థికంగా ఒడిదుడుకులు రావడంతో మళ్లీ గుంటూరుకు వెళ్లి మున్సిపల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశాడు. ఉదయం ఆరింటి నుంచి ట్యూషన్లు చెప్పడం, బడికి వెళ్లడం, మళ్లీ రాత్రి తొమ్మిదింటి వరకూ ట్యూషన్లు ఇలా జీవితం సాగింది.

ఆ తర్వాత ఏం జరిగిందనేది జయప్రకాశ్ రెడ్డి మాటల్లోనే… ప్రేమించుకుందాం రా.. చిత్రానికంటే ముందు ఒకసారి డైరెక్టర్ జయంత్ సి పరాన్జి నుంచి నాకు ఫోన్ వచ్చింది.సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మించబోతున్న చిత్రంలో విలన్ గా అమ్రిష్ పురిని అనుకున్నాం కుదరలేదు.తర్వాత నానాపటేకర్ ని సంప్రదించాం, ఆయన దాదాపు కోటిన్నర రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారు.అంత మొత్తం మన బడ్జెట్ కు ఎక్కువైతుందని కాదనుకున్నాం. ఆ తర్వాత ఈ సినిమాలో విలన్ పాత్రకు ఎవరైతే బాగుంటుందని ఆలోచించే క్రమంలో.. ఆల్బమ్ చూస్తుండగా నీ ఫోటో దగ్గరికి వచ్చి మేమంతా ఆగిపోతున్నాం.

ఈ సినిమాలో విలన్ పాత్ర నువ్వు చేస్తేనే బాగుంటుందని దర్శకుడు జయంత్ సి.పరాంజి చెప్పగానే నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో విలన్ రాయలసీమలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ కనుక మీ ఫేస్ లో ఎలాంటి కామెడీ యాంగిల్ కనిపించకూడదు. సినిమా పూర్తయేoతవరకు చాలా సీరియస్ గా మీ పాత్ర ఉంటుందని డైరెక్టర్ జయంత్ చెప్పడంతో.. రాయలసీమ స్లాంగ్ లో డైలాగ్స్ కోసం నేను దర్శక నిర్మాతల అనుమతి తీసుకొని రాయలసీమ జిల్లాల్లో ఒక టేప్ రికార్డర్ తో పర్యటించి అక్కడి వ్యవహారిక భాషను రికార్డ్ చేసుకొని, తిరిగి ఇంటికి వెళ్లి,అవి వినుకుంటూ పడుకున్నాను.

తర్వాత పరుచూరి బ్రదర్స్ ని డైలాగ్స్ రాయమని చెప్పి అందులో కొన్నిటిని నేను వారి ముందే ప్రదర్శించాను. వారు చాలా వరకు నన్ను ఎంకరేజ్ చేశారు. ప్రేమించుకుందాం రా సినిమాలో విలన్ గా నాకు విపరీతమైన పేరు వచ్చింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఈశ్వరేచ్చగా నేను భావిస్తాను. ఆ తర్వాత 40 రోజులు శివదీక్ష తీసుకొని తిరిగి నన్ను సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసిన శివయ్యకు నా ముక్కు చెల్లించుకున్నాను. ఆ తర్వాత ప్రేమించుకుందాం రా.. సినిమా విడుదలై,బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక అప్పటి నుంచి నేను వెనుతిరిగి చూసుకోలేదు. ఒక సినిమా తర్వాత మరొక సినిమాలో విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ..బిజీ అయిపోయానని ఆ ఇంటర్వ్యూలో జయప్రకాశ్ రెడ్డి వివరించారు.