బెల్లం, పాల మిశ్రమంతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్ పెట్టేయవచ్చు..

పాలల్లో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ పాలు చాలా అవసరం. ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. ఇలా ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతీ ఒక్కరూ పాలను తీసుకుంటారు. ప్రతిరోజు పాలు తాగితే ఎటువంటి అనారోగ్యాలు దరి చేరవు. కొంతమంది అయితే అసలు పాలు తాగడానికి ఇష్టపడరు.

అలాంటి వాళ్ళు పాలలో చక్కెరతో పాటు ఏదన్నా ఫ్లేవర్ కలుపుకుని తాగుతారు. ఇలా పాలల్లో పంచదార కలుపుకొని తాగడం కంటే.. బెల్లం కలుపుకొని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి.. దాని గురించి తెలుసుకుందాం..

జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు.. తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. ఈ పాలు, బెల్లం మిశ్రమంలో ఉండే పోషకాల వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్త హీనతతో బాధపడే వారు.. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే. ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.

మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడేవాళ్ళు పాలలో బెల్లం కలుపుకొని తాగడం వలన ఎముకలు దృడంగా అవడమే కాకుండా మొకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. చుండ్రు ఎక్కువగా ఉన్నవాళ్లు దీనిని తీసుకుంటే.. ఎక్కువగా ఆ సమస్య నుంచి బయపడొచ్చు. ఈ మిశ్రమానికి కర్పూరం, తులసి ఆకులు కలిపితే రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఈ మిశ్రమాన్ని కలుపుకొని తాగడం వల్ల చర్మం చాలా కాంతివంతంగా అవుతుంది.