మంచు ఫ్యామిలీకి సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. మంచు మోహన్ బాబు అతడి సినిమాలతో పాటు.. వివాదస్పద కామెంట్స్ చేస్తూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలలో మంచు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే.
మా ఎన్నికలు జరిగిన తీరుపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 11 మంది రాజీనామా కూడా చేసిన విషయం కూడా విధితమే. అతడు ఎన్నికల జరుగుతున్న సమయంలో ప్రవర్తించిన తీరు ప్రతీ ఒక్కరికి ఆగ్రహం తెప్పించింది. కొంతమంది మోహన్ బాబు తమను కొట్టడానికి కూడా వెనుకాడలేదు అంటూ సీనియర్ నటులు ఆరోపించారు.
ఆ సమయంలో బెనర్జీ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. దీనిపై ప్రముఖ జర్నలిస్ట్ జాకిర్ మంచు మోహన్ బాబుపై ఏదో వార్త టివి9 టెలికాస్ట్ చేసిన నేపథ్యంలో మోహన్ బాబు కోపంతో ఊగిపోయారు. ఆఫీస్ కు వచ్చి గన్ పట్టుకొని వచ్చి అతడు ఎక్కడ.. చంపేస్తాను.. కాల్చేస్తాను అంటూ కోపంతో ఉగిపోయాడు. మోహన్ బాబుకు కోపం వస్తే ఎలా ఉంటుందో ఆరోజు చూశామని సీనియర్ నటులు మంచు విష్ణు దగ్గరకు వచ్చి విచారం వ్యక్తం చేశారు.
ఎవరితోనైనా ప్రవర్తించే సమయంలో అలా కోపంతో ఊగిపోవడం అనేది కరెక్ట్ కాదని.. నచ్చకపోతే పరువు నష్టం దావా వేయాలి లేదా కేసు ఫైల్ చేయాలి కానీ.. ప్రవర్తించే పద్ధతి మాత్రం ఇది కాదంటూ చెప్పారు. అయితే అతడి కోపం ఎదుటి వారికి ఎప్పుడు ఇబ్బంది కల్పించలేదని విష్ణు చెప్పుకొచ్చాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…