Kacha Badam : పల్లీలు అమ్ముకునే వ్యక్తి ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు..

సోషల్ మీడియా జమానాలో.. టాలెంట్ ఏ మూలన ఉన్నా.. ప్రపంచానికి ఇట్టే తెలిసిపోతుంది. ఇంతకు ముందు ఎంతో కష్టపడితే కానీ జనాల్లో గుర్తింపు వచ్చేద కాదు.. కానీ ప్రస్తుతం ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోతున్నారు. మంచి గుర్తింపు వస్తుంది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మీద తిరుగులేని గుర్తింపు అందుకుంటున్నారు. పలువురు ఓ రేంజిలో గుర్తింపు అందుకుంటున్నారు. తాజాగా మరో వ్యక్తి బాగా పాపులర్ అయ్యాడు. ఇంతకీ అతని కథేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఈయన పేరు భువన్ బడ్యాకర్. పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తి. చాలా పేద వాడు. బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో వేరు శనగ కాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. రోజుకు 2 నుంచి 3 వందల రూపాయలు సంపాదిస్తున్నాడు. తాజాగా పల్లీలు కొనడానికి వచ్చిన కొందరు వ్యక్తులు ఆయన అద్భుతంగా పాడటం గుర్తించారు. తనకు తానుగా ఓ పాట రాసుకున్నాడు. పల్లీలు అమ్ముకుంటూ ఆ పాట పాడేవారు. జనాలు ఆయన పాటకు ఆకర్షితులు అయ్యేవారు. ఆ పాట వినడం కోసం అయినా.. తన దగ్గర పల్లీలు కొనడానికి వచ్చేవారు.

తాజాగా ఆయన పాట పాడుతుంటే ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు భువన్. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా భువన్ పాట హల్ చల్ చేస్తుంది. నెటిజన్లను ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంది. దేశ విదేశాల్లో ఈ పాట మార్మోగుతుంది. ఇతర దేశ ప్రజలు కూడా ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కు కూడా ఈ పాట ఆసరాగా నిలిచింది.

తాజాగా అతడికి ఓ ఆడియో కంపెనీ మంచి అవకాశాన్ని కలిగించింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ పాటను తనతో పాడించింది. తన కంపెనీ ద్వారా ఆయన పాటను మార్కెట్ లోకి విడుదల చేసింది. రోడ్డు మీద మాసిపోయిన దుస్తులతో ఉన్న అతడికి మంచి వస్త్రాలు కొనిపెట్టింది. ఆయన లుక్ తో పాటు ఆయన ఆర్థిక స్థితిని కూడా మార్చి వేసింది సదరు మ్యూజిక్ కంపెనీ. ఆయన పాటను ర్యాప్ వెర్షన్ లో కూడా రీమేక్ చేశారు. ఈ పాట పాడిన భువన్ ను ఆ కంపెనీ ఫైనాన్షియల్ గా ఆదుకుంది.