Kantara: ఆర్ఆర్ఆర్ సినిమాని వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న కాంతారా !

Kantara: సాధారణంగా చిత్ర పరిశ్రమలో అన్ని భాషలలో ప్రపంచ స్థాయిలో విడుదలైన సినిమాలన్నింటికీ ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ సైట్ ఐఎండిబి(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రజాదరణ బట్టి ఆ సినిమాలకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రపంచంలోని వివిధ దేశాలలో వివిధ భాషలలో తెరకెక్కిన సినిమాలకు ఈ విధంగా రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ సినిమాలకు సంబంధించిన లిస్ట్ విడుదల చేశారు. ఈ జాబితాలో 250 సినిమాలు ఆదరణ సంపాదించుకోగా ఇందులో మొదటి స్థానాన్ని తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైన కాంతార సినిమా చోటు దక్కించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.కన్నడ హీరోగా తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా తాజాగా ఐఎంబిడి జాబితాలో మొదటి స్థానాన్ని చోటు చేసుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ జాబితాలో తెలుగు సినిమాల్లో కూడా చోటు సంపాదించుకున్నాయి. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దశరత్వంలో మల్టీ స్టార్ సినిమాగా తాజాగా విడుదలైన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా 190వ స్థానంలో ఉండగా కాంతార సినిమా మాత్రం మొదటి స్థానంలో ఉండడం విశేషం.

Kantara: భారీ విజయమందుకున్న కాంతార

ఇక ఈ జాబితాలో కేరాఫ్ కంచరపాలెం 17వ స్థానంలో ఉండగా నాని జెర్సీ 22వ స్థానంలో ఉంది. సీతారామం 39వ స్థానంలో ఉండగా, మహానటి 44, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ 48, బాహుబలి 2 101, బొమ్మరిల్లు 125, రంగస్థలం 129, ఆర్ఆర్ఆర్ 190వ స్థానంలో ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాపాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి ఎలాంటి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే అయితే ఈ సినిమాని వెనక్కి నెట్టి కాంతార సినిమా మొదటి స్థానంలో చోటు సంపాదించుకోవడంతో చిత్ర బృందం అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.