అబార్షన్ చేయించుకోవడం మన దేశంలో నేరమా? ఎందుకు?

సాధారణంగా మహిళల గర్భంలో పెరుగుతున్న పిండం బయటకు తొలగించడాన్ని గర్భస్రావం అంటారు. అయితే ఇది మానవ ప్రమేయం లేకుండా అదంతట అదే అబార్షన్ జరిగితే దానిని అబార్షన్ లేదా గర్భస్రావం అని అంటారు. మన దేశంలో దాదాపు 30 నుంచి 40 శాతం మహిళలు ఈ విధమైనటువంటి గర్భస్రావం ఎదుర్కొంటున్నారు. మానవ ప్రమేయం లేకుండా జరిగే దానిని గర్భస్రావం అంటారు.

కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా గర్భంలో పెరుగుతున్న టువంటి పిండాన్ని తొలగించడాన్ని ప్రేరేపిత గర్భస్రావం అంటారు. ఆకస్మిక గర్భస్రావాన్ని న్యాయపరమైన, వైద్య పరిభాషలో అబార్షన్‌గా పరిగణించరు. ఈ విధమైనటువంటి అబార్షన్ కొన్నిసార్లు మనదేశంలో చట్టపరంగా న్యాయమైనది అయితే కొన్నిసార్లు, చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది.

గర్భంలో పెరుగుతున్న పిండం కొన్ని అనివార్య కారణాల వల్ల గర్భస్రావం జరిగితే ఆ పిండం తొలగించడం కోసం చేసే అబార్షన్ చట్టపరంగా న్యాయమైనదే. మరికొందరిలో పిండం ఎదుగుదలలో లోపాలు ఏర్పడినప్పుడు ఆ పిండాన్ని తొలగించడాన్ని న్యాయమైనదిగా భావిస్తారు. అయితే ఈ విధంగా కడుపులో పెరుగుతున్న బిడ్డను తొలగించడానికి కేవలం గర్భం మోస్తున్న మహిళా అనుమతి చాలు. అయితే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సున్న వారికి,మతిస్థిమితం లేని వారికి అబార్షన్ చేయాలంటే తప్పనిసరిగా సంరక్షకుల అనుమతి అవసరం.

కొందరు మహిళలు లింగ వివక్షత వల్ల ముందుగానే అమ్మాయి అని తెలుసుకుని వారిని తొలగించాలని భావిస్తుంటారు. ఈ విధంగా అబార్షన్ చేసే వారిపై భారతదేశంలో నేరంగా భావించి పలు కేసులను నమోదు చేయవచ్చు. ఈ విధమైనటువంటి అబార్షన్ లను చేయటం మన దేశంలో చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు.24 వారాల తర్వాత ఎటువంటి మహిళలలో అయినా అబార్షన్ జరిగితే వారి ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే అబార్షన్ అనేది కేవలం వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. అలాంటప్పుడే తల్లి ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా ఉంటుంది.