సాధారణంగా చెరువుగట్టు దగ్గర లేదా కాలువల కింద.. బావుల కింద పంటలు పండించడం మనం చూస్తుంటాము. కానీ విమానాశ్రయం రన్ వే పక్కన వ్యవసాయం చేయడం విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న జపాన్ లో మాత్రం టకావో షిటో అనే వ్యక్తి రన్ వే పక్కన వ్యవసాయం చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు.
జపాన్లోని అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాల్లో న్యూ టోక్యో విమానాశ్రయం ఒకటి. 1960లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలని టోక్యో ప్రభుత్వం నిర్ణయించింది.అందుకుగాను ఆ చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్న భూములను రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసింది.కొందరి ఈ భూములు ప్రభుత్వానికి అమ్మి నగరానికి వెళ్లిపోగా మరి కొందరు ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయకూడదని పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగించారు.
ఈ ఉద్యమంలో ఎంతోమంది ప్రభుత్వానికి భూములు ఇవ్వగా టకావో షిటో తండ్రి మాత్రం తన భూమిని ఇవ్వకుండా అక్కడ వ్యవసాయం చేస్తున్నాడు.ఈ విషయంపై జపాన్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లిన తీర్పు అతనికి అనుకూలంగా రావడంతో అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఈ తోటలోకి వెళ్లే మార్గాన్ని విమానాశ్రయ అధికారులు మూసివేయడంతో ఆ విషయంపై కోర్టుకెళ్లి దారిని ఏర్పరచుకున్నారు.
టకావో షిటో తండ్రిమరణం తర్వాత అతను ఇక్కడే కూరగాయలు, పండ్లను పండిస్తూ జపాన్ లోని ప్రముఖ రెస్టారెంట్లకు తరలిస్తున్నారు. నిత్యం ఎంతో శబ్దం చేసే ఈ రన్ వే పక్కన అతను వ్యవసాయం చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు. వారాంతపు రోజులలో
టకావో షిటో స్నేహితులు అక్కడికి చేరుకొని ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా గడుపుతుంటారు.ప్రభుత్వాన్ని ఎదిరించి తమ భూమిని కాపాడుకున్నారనే గౌరవం సంపాదించుకున్న టకావో షిటో కుటుంబం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…