మీ ఇంట్లో ఉపయోగించే ఫర్నిచర్ చాలా పాతగా అయిపోయిందా? కొత్త ఫర్నిచర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే. ఫర్నిచర్ అమ్మకాల్లో ప్రపంచ దిగ్గజంగా కొనసాగుతున్న స్వీడన్ కంపెనీ.. ఐకియా 2030 నాటికి “క్లైమేట్ పాజిటివ్” గా మారడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా ఫర్నిచర్ బైబ్యాక్, రీసేల్ స్కీమ్లను ప్రారంభించింది.
పర్యావరణంలో వ్యర్థ పదార్థాలను తగ్గించి, పర్యావరణాన్ని కాపాడటం కోసమే ఐకియా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐకియాలో కొనుగోలు చేసిన ఫర్నిచర్ కొంతకాలం పాటు ఉపయోగించి తరువాత ఫర్నిచర్ మార్చాలనుకునే వారు పాత ఫర్నిచర్ ను తిరిగి ఐకియా స్టోర్ రూములో రిటన్ చేయవచ్చు.దీనికి గాను వారికి బైబ్యాక్ వోచర్లు ఇస్తారు.
వోచర్లను వినియోగించి ఇతర వస్తువులను డిస్కౌంట్లో కొనుగోలు చేయవచ్చు. అయితే కస్టమర్లు రిటర్న్ చేసే వస్తువులు మెరుగైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే 50% కొనుగోలు చేస్తామని, ఆ వస్తువుల పై ఏవైనా గీతలు, స్క్రాచెస్ ఉన్నప్పుడు 40 శాతానికి కొనుగోలు చేస్తామని, బాగా స్క్రాచెస్ ఏర్పడిన ఫర్నిచర్ ను 30 శాతానికి కొనుగోలు చేస్తామని ఐకియా తెలిపింది.
ఈ విధంగా ఐకియా తీసుకున్న ఎక్స్చేంజ్, రిటర్న్, ఫర్నిచర్ పాలసీని ముందుగా బ్రిటన్ లో అనేక నగరాల్లో ఈ పథకాలను అమలు చేసిన తర్వాత దీన్ని ఇక్కడ ప్రారంభించాలని ఐకియా నిర్ణయించుకుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…