Movie News

అడవి శేష్ పెద్ద మనసు.. కరోనా పేషేంట్స్ కోసం ఏకంగా అలా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్ర స్థాయిలో వ్యాపించడంతో ప్రజలు ఎంతో భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా రోజురోజుకు కేసులు పెరగడంతో సరైన మౌలిక వసతులు లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి వారికి తోచిన రీతిలో సహాయం చేస్తున్నారు.

ఇక సినిమా సెలబ్రిటీల విషయానికి వస్తే సోనుసూద్ ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. సోనూసూద్ బాటలోనే మరికొంత మంది హీరోలు ఫాలో అవుతూ తమ వంతు సాయంగా వారికి తోచిన సహాయం చేస్తూ బాధితులను ఆదుకున్నారు. తాజాగా సందీప్ కిషన్ కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రెండేళ్ల వరకు చదివించే బాధ్యత తీసుకున్నారు. అదే విధంగా తాజాగా హీరో అడివి శేష్ తన వంతు సహాయంగా హైదరాబాద్ కోటి ప్రభుత్వ ఆసుపత్రి కోసం వాటర్ ప్లాంట్ డొనేట్ చేసారు.

కోటి ప్రభుత్వ హాస్పిటల్‌లో గత కొన్నేళ్లుగా తాగునీటి సమస్య ఉండటంతో ఇక్కడికి వచ్చే రోగులు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అడివి శేష్ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో 865 లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ప్లాంట్‌ను హాస్పటల్‌లో అరెంజ్ చేసారు. ఈ వాటర్ ప్లాంట్ 1000 లీటర్ల తాగునీటిని శుద్ది చేస్తుంది.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున హీరో అడివి శేష్  పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే అడివి శేష్ 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న “మేజర్ ” చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago