Lakshmi Parvathi: ఎన్నికల వేళ పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి.. ఐక్యం కావాలంటూ?

Lakshmi Parvathi: సీనియర్ ఎన్టీఆర్ సతీమణి వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి బుధవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కపటం లేని మంచి మనిషి అని తెలియజేశారు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుని నమ్మి మోసపోతున్నారని తెలిపారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరు.

తన సొంత మామయ్యని వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడుది. పిఠాపురంలో కాపులందరూ కూడా ఐక్యం కావాలని తెలిపారు. ఇలా కాపులందరూ కూడా వైసిపి అభ్యర్థి వంగా గీతకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు వంగా గీత స్థానిక నేత ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఆమె వెంటనే స్పందిస్తారు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదని తెలిపారు.

పవన్ కళ్యాణ్ వలస వచ్చారు..
పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వలస వచ్చారని ఈమె తెలిపారు. కానీ వంగా గీత స్థానికురాలు. అందుకే వంగా గీతకు ఓట్లు వేసి అసెంబ్లీకి పంపించాలని ఈమె కోరారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో భాగంగా గాజువాక భీమవరం నుంచి పోటీ చేసినటువంటి ఈయనకు రెండు చోట్ల చేదు అనుభవాలే ఎదురయ్యాయి ఇలా రెండు ప్రాంతాలలో ఓటమిపాలు అయినటువంటి పవన్ కళ్యాణ్ కాపు ఓట్లు అధికంగా ఉన్నటువంటి పిఠాపురం నుంచి పోటీకి దిగారు.