రేపే చివరి సూర్యగ్రహణం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..?

2020 సంవత్సరానికి చివరి సూర్యగ్రహణం రేపు సంభవించబోతుంది. 2020 సంవత్సరానికి మొత్తం ఆరు గ్రహణాలు ఉండగా ఈ ఆరు గ్రహణాలలో రెండు సూర్యగ్రహణాలు, నాలుగు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. 2020 సంవత్సరం కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకోగా వ్యాపార వాణిజ్యాలు ఈ సంవత్సరం గతంలో ఎప్పుడూ లేని విధంగ భారీ నష్టాలను చవిచూశాయి.

మన దేశ కాలమాన ప్రకారం సూర్యగ్రహణం డిసెంబర్ 14వ తేదీ రాత్రి 7 గంటల 3 నిమిషాలకు ప్రారంభం కానుండగా డిసెంబర్ 15వ తేదీ రాత్రి 12.24 గంటలకు ముగియనుంది. మొదటి సూర్యగ్రహణం ఈ ఏడాది జూన్ 21న సంభవించగా దాదాపు ఆరు నెలల వ్యత్యాసంతో రెండో సూర్యగ్రహణం సంభవిస్తోంది. మనలో చాలామంది గ్రహణాలు మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతుండగా జ్యోతిష్యులు సైతం అదే విషయాన్ని వెల్లడిస్తున్నారు.

జ్యేష్ట నక్షత్రంలో వృశ్చిక రాశిలో చివరి సూర్యగ్రహణం సంభవించనుంది. అయితే భారత్ లో ఈ సూర్య గ్రహణం కనిపించదు కాబట్టి సూతక ప్రభావం ఉండదు. ఫసిఫిక్ మహాసముద్రంలోని కొని ప్రాంతాలలో, దక్షిణామెరికా, దక్షిణాఫ్రికా అట్లాంటిక్ హిందూ మహాసముద్రం లోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. గ్రహణం సమయంలో ఆహారపదార్థాలను తినడం, తాగడం చేయకూడదు.

గ్రహణం సమయంలో సూర్యుని నుంచి వచ్చే రేడియేషన్ ప్రమాదకరం కాబట్టి ఇంటికే పరిమితమైతే మంచిది. గర్భిణులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు విడిచి బయటకు రాకూడదు. బయటకు వస్తే గ్రహణ ప్రభావం పిల్లలపై పడే అవకాశం ఉంది. గ్రహణం సమయంలో శుభ కార్యక్రమాలను చేయకూడదు.