Featured

Rashmika: రష్మిక సినిమాలకు కమిట్ అవ్వాలంటే స్క్రిప్టులో ఈ విషయాలు ఉండాల్సిందేనా?

Published

on

Rashmika: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న ఒకరు. ప్రస్తుతం ఈమె నేషనల్ క్రష్ గా గుర్తింపు పొంది వరుస సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్లో దూసుకుపోతున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా రష్మిక ఓ వెలుగు వెలిగారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలా సక్సెస్ అవ్వడం వెనుక ఉన్నటువంటి కారణాలను తెలిపారు. ముఖ్యంగా స్క్రిఫ్ట్ ఎంపిక విషయంలో ఈమె తీసుకునే జాగ్రత్తలను ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ తాను ముందుగా స్క్రిప్ట్ విన్న తర్వాత దానిని పూర్తిగా చదువుతానని తెలిపారు. స్క్రిప్ట్ మంచి కంటెంట్ ఉంటే అనంతరం నా పాత్రకు ప్రాధాన్యత ఉండాలని భావిస్తాను. అంతేకాకుండా నేను చేసే పాత్ర ద్వారా కొంచెం అయినా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని భావిస్తాను ఈ మూడు అంశాలు కనుక స్క్రిప్టులో ఉంటే తాను ఆ సినిమాలను వదులుకోనని తెలిపారు.

Advertisement

ఈ మూడు విషయాలు ఉండాల్సిందేనా..
ఈ విధంగా రష్మిక స్క్రిప్ట్ ఎంపిక విషయంలో ఈ జాగ్రత్తలను తీసుకుంటారని ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ఈమె చేసే సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక పుష్ప2 సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Advertisement

Trending

Exit mobile version