Medical: అడ్డగోలు మెడికల్ విక్రయాలు కుదరదు..! అవి తప్పనిసరి చేస్తూ అధికారుల ఆదేశాలు..!

Medical: అడ్డగోలు మెడికల్ విక్రయాలు కుదరదు..! అవి తప్పనిసరి చేస్తూ అధికారుల ఆదేశాలు..!

Medical: కరోనా కాలంలో మెడికల్ మాఫియా రెచ్చిపోయింది. ఇష్టారీతిలో ధరలకు మందులను అమ్మింది. జనాల భయాలనే ఆసరా చేసుకుని అందినకాడికి దోచుకుంది. గతంతో పోలిస్తే మల్టీ విటమిన్, సీ విటమిన్, డీ విటమిన్ లకు ధరలు అమాంతం పెంచేసింది. ఒకానొక సమయంలో మెడికల్ షాపుల్లో ఈ మందులు కూడా లభించని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. 

Medical: అడ్డగోలు మెడికల్ విక్రయాలు కుదరదు..! అవి తప్పనిసరి చేస్తూ అధికారుల ఆదేశాలు..!
Medical: అడ్డగోలు మెడికల్ విక్రయాలు కుదరదు..! అవి తప్పనిసరి చేస్తూ అధికారుల ఆదేశాలు..!

ఇదిలా ఉంటే మెడికల్ షాపులు పుట్టగొడుగుల్లా పట్టుకొస్తున్నాయి. గల్లీకో షాపు అన్న రీతిలో మెడికల్ దందా కొనసాగుతోంది. కనీసం అనుభవం లేని వ్యక్తులు మెడికల్ షాపులను నడుపుతున్నారు. వీటిపై నిఘా లేదు. దీంతో ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. 

Medical: అడ్డగోలు మెడికల్ విక్రయాలు కుదరదు..! అవి తప్పనిసరి చేస్తూ అధికారుల ఆదేశాలు..!

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర జౌషధ నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్మాసిస్టులు లేకుండా మెడికల్ షాపులను నడిపితే ఇకపై సీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే డ్రగ్ ఇన్స్పెక్టర్లకు అందాయి. కనీసం నెలకు 25 షాపులను తనిఖీలు చేసే విధంగా ఆదేశాలు అందాయి. నివేదికలను యాప్ ద్వారా డీసీఏ డైరెక్టర్ కు పంపాలని ఆదేశించాయి. 

ఇన్స్పెక్టర్లకు తెలిసే జరగుతుందనే ఆరోపణలు..

ప్రస్తుతం రాష్ట్రంలో ఫార్మాసిస్టుల లేకుండానే మెజారిటీ మెడికల్ షాపులను నిర్వాహకులు నడిపిస్తున్నారు. వేరే వ్యక్తుల ఫార్మసీ డిగ్రీ సర్టిఫికేట్లు పెట్టుకుని వారి పేరుపై వేరే వారు దందా చేసుకుంటున్నారు. ఇందుకు సదరు డిగ్రీ చేసిన వ్యక్తులకు నెలకు ఇంత అని మాట్లాడుకుంటున్నారు. ఇదంతా స్థానికంగా ఉండే డ్రగ్ ఇన్స్పెక్టర్లకు తెలిసే జరగుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కనీసం డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్లు లేకుండా మందులు విక్రయిస్తున్నారు. ఇక ధరల విషయం దేవుడికే ఎరుక. వారంత ధర చెల్లించి మందుల్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రజలకు ఆర్థిక భారం తప్పడం లేదు.