Singer Sunitha: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సింగర్ సునీత తనయుడు… నిర్మాతగా సునీత భర్త!
Singer Sunitha: సంగీత ప్రేమికులకు సింగర్ సునీత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈమె కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఒంటరిగా తన బిడ్డల బాధ్యతలను చూసుకుంటూ జీవితంతో పోరాటం చేస్తున్న సునీత గత ఏడాది మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని రెండవ వివాహం చేసుకున్నారు.
ఇలా రెండవ వివాహం తర్వాత సునీత సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.రెండో వివాహం చేసుకోవడంతో మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న ఈమె తన జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారని చెప్పవచ్చు. ఇక తన భర్త వ్యాపార వ్యవహారాలను చూసుకుంటూ మరోవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్న సునీత తనకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే సునీత తన పిల్లల కెరియర్ పట్ల కూడా ఎంతో బాధ్యత కలిగి ఉన్నారని తెలుస్తోంది.ఇప్పటికే తన కూతురిని సింగర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సునీత తన కొడుకుని కూడా హీరోగా పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సునీత కొడుకు ఆకాశ్ ను తెలుగు తెరకు హీరోగా పరిచయం చేయాలని సునీత ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఆకాష్ ఇప్పటికీ నటనలో శిక్షణ తీసుకుంటున్నారని త్వరలోనే ఇతనిని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఆకాష్ హీరోగా నటించే సినిమాకు సునీత భర్త రామ్ నిర్మాతగా మారనున్నట్లు సమాచారం. ఇకపోతే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…