Megastar Chiranjeevi : అప్పట్లో చిరంజీవి విలన్ గా వణుకు పుట్టించాడు.. రజనీకాంత్ నే సవాలు చేస్తూ ఫ్యూజులు ఎగిరి పోయే ఫైట్స్..!!

Megastar Chiranjeevi : దక్షిణాది సినీ పరిశ్రమలో చిరంజీవి మరియు రజినీకాంత్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తమిళ ఫిలిం ఇండస్ట్రీ లో రజినీకాంత్ నెంబర్ వన్ హీరో అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి నెంబర్ వన్ హీరో.. ఇద్దరు ఇద్దరే.. ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవి.. ఒక్కరు తన స్టైల్ తో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త ఒరవడిని సృష్టిస్తే.. మరొక్కరు తమ అద్భుతమైన డాన్స్ మరియు ఫైట్స్ తో ఒక మూసలో వెళ్తున్న తెలుగు సినిమా గతిని మార్చేశారు.. ఇలా వీళ్లిద్దరి గురించి చెప్పుకుంటూ పోతే ఈ ఆర్టికల్ సరిపోదు..

Megastar Chiranjeevi : అప్పట్లో చిరంజీవి విలన్ గా వణుకు పుట్టించాడు.. రజనీకాంత్ నే సవాలు చేస్తూ ఫ్యూజులు ఎగిరి పోయే ఫైట్స్..!!

కెరీర్ ప్రారంభంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో “కాళీ” మరియు “బందిపోటు సింహం” వంటి సినిమాలు వచ్చాయి.. కానీ స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. 1991 ఆ ప్రాంతంలో దళపతిలో రజనీకాంత్ తో నటించే అవకాశం వచ్చిన హీరోకి సరిపడా రోల్ కాకపోవడంతో అవకాశాన్ని సున్నితంగా చిరంజీవి తిరస్కరించారు. ఆ సమయానికే మెగాస్టార్ గా తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్స్ తో ఒక ప్రభంజనంలా దూసుకుపోతున్నారు. అయితే 1980 ప్రారంభ దశకంలో రజిని చిరుల చిత్రం విడుదల అయింది.

‘బందిపోటు సింహం’ యాక్షన్ బెస్డ్ మూవీ మరియు ఇది తమిళ చిత్రం “రణువ వీరన్” యొక్క డబ్బింగ్ వెర్షన్, ఇందులో రజనీకాంత్ మరియు శ్రీదేవి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రంలో చిరు యాంటీ హీరోగా నటించారు మరియు ఈ చిత్రంలో రజనీకాంత్ మరియు చిరు స్నేహితులు. రజనీ సోదరి చిరును ఇష్టపడి అతనిని వివాహం చేసుకుంటుంది. కొద్ది రోజులకే చిరు తనకు నచ్చిన వ్యక్తి కాదని తెలిసి ఆమె చనిపోతుంది.

రజనీకాంత్ ఇప్పుడు చిరు మరియు అతని గ్యాంగ్ కోసం వెతుకుతుంటాడు. వారు (చిరు గ్యాంగ్)కొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నంలో ప్రజలను దోచుకుంటున్నారు. చిరు గ్యాంగ్ ను రజనీకాంత్ ముగింపు పలకాలనుకుంటాడు. చిరు తన కొడుకును రజనీకాంత్ చేతిలో నుండి తిరిగి పొందాలనుకుంటాడు. ఆ ప్రక్రియలో చివరికి తన కొడుకు చేతిలోనే చంపబడతాడు. వీరిద్దరి ఘర్షణ సన్నివేశాలలో అద్భుతమైన పోరాటాలు ఉన్నాయి. పంచులు ఇవ్వడంలో నువ్వా నేనా అన్నట్టుగా నటించారు. ఒక దశలో చిరు, రజినీకాంత్ ను మించి ఫైట్ చేశారన్నది నిర్వివాదాంశం. వీరిద్దరి పోరాట సన్నివేశాలను చూస్తున్న సగటు ప్రేక్షకుడు ఊపిరి బిగబట్టుకొని చూశాడంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి బందిపోటుగా ఊళ్లకు ఊర్లు దోచుకుంటూ తను ధరించిన కళ్ళద్దాలు తీసీ ఒంటి కన్నుతో చూస్తే గ్రామాల్లోని ప్రజలు వణికిపోతుంటారు. చిరుకు ఉన్న కొత్త క్రేజ్‌ను మరియు రజనీకి ఉన్న ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమా తెలుగులోకి డబ్ చేయబడింది.