జుట్టు విపరీతంగా రాలిపోతుందా.. అయితే దీనిని తలకు పంట్టించండి..

ప్రకృతి మనకు వివిధ రకాల సుగంధద్రవ్యాలను అందిస్తోంది. అందులో మెంతులు ప్రత్యేకమైనవి. దీంతో ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. కరోనా వచ్చిన వారికి ట్రీట్ మెంట్ ఇచ్చే సమయంలో కొంతమందికి జుట్టు రాలుతోంది. తర్వాత కూడా విపరీతంగా హెయిర్ ఫాల్ కూడా అవుతోందంటూ కొంతమంది వాపోతున్నారు.

ఇలా జరకుండా ఉండాలంటే మెంతుల తైలం బాగా పనిచేస్తుందని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. తలనొప్పి వచ్చే వారికి కూడా ఈ తైలం ఉపయోగపుడుతుందని చెబుతున్నారు. ఆ నూనె జుట్టుకి కూడా బాగా మేలు చేస్తుంది. ప్రస్తుతం ఇది ఆన్ లైన్ ఈ కామర్స్ లో కూడా అందుబాటులో ఉంది. సూపర్ మార్కెట్లలో కూడా ఇది లభిస్తున్నాయి. జుట్టు పెరిగేందుకు మార్కెట్లో వివిధ రకాలు అయిల్స్ ఉన్నాయి.. కానీ పరిశోధకుల ప్రకారం.. మెంతుల నూనె లేదా ఉల్లిపాయల నూనె జుట్టు పెరిగేందుకు బాగా ఉపయోగపడుతోందనీ తెలియజేస్తున్నారు.

అంతేకాకుండా తెల్లగా ఉన్న జుట్టును కూడా నల్లగా చేయగలవు ఈ రెండు నూనెలు. ఈ విషయంలో మెంతుల నూనె ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తుంది. ఈ మెంతుల నూనెను వంటింట్లో మనం కూడా తయారు చేసుకోవచ్చు. మెంతులకు గుజ్జుగా చేసి జుట్టుకు రాసుకుంటే ఎంతో మేలు జరగనుంది. ఫలితంగా జుట్టు బాగా పెరుగుతుంది. మెంతుల్లో ఎక్కువగా ప్రోటీన్స్, ఐరన్ ఉంటాయి. ఇవి జట్టు విపరీతంగా పెరిగేందుకు ఉపయోగపడతాయి.
.
దీని తయారీకి.. నాలుగు టీ స్పూన్ల మెంతులు.. కొద్దిగా కొబ్బరి నూనె.. గుప్పెడు కరివేపాకులు.. నాలుగు మందార ఆకులు.. రెండు మందార పువ్వులు తీసుకొని గిన్నెలో వేసి వేడి చేయాలి. అవి నల్లగా మాడిన తర్వాత కొబ్బరినూనెలో ఉడికించాలి. ఇలా నల్లగా మారిన కొబ్బరి నూనెను స్టోర్ చేసుకొని.. తలకు పట్టిస్తే మంచి ఫలితాలు వస్తాయి.