దేశ ప్రజలకు దీపావళి కానుక ఇచ్చిన మోడీ.. భారీగా తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు..?

దేశ ప్రజలకు మోడీ సర్కార్ శుభవార్తను తెలిపారు.గత కొద్ది రోజుల నుంచి దేశ ప్రజలు పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరి పై అధిక భారం పడింది.ఈ క్రమంలోనే అధిక భార సమస్యలతో సతమతమవుతున్న వారికి దీపావళి కానుకగా మోడీ సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్ డీజిల్ ధరలతో ఎంతో సతమతమౌతున్న సామాన్య ప్రజలకు నిజంగా ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు.

దీపావళి పండుగ సందర్భంగా మోడీ సర్కార్ పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గించాలని మోడీ సర్కారు భావించింది. ఈ క్రమంలోనే తగిన ధరలు గురువారం 4వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.ఇలా పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతి ఒక్కరు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చమురు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని భావిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్ ధర పై ఐదు రూపాయలు, డీజిల్ ధరలపై పది రూపాయలు తగ్గిస్తే సామాన్య ప్రజలకు మరింత ఊరటగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే తగ్గించిన ధరల ఆధారంగా ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 109.49 ఉండగా లీటర్ డీజిల్ ధర 97.40 కి చేరుకుంది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 111.61 ఉండగా, లీటరు డీజిల్ ధర 98.89 చేరుకుంది. ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా దేశ ప్రజలకు అద్భుతమైన కానుక ఇచ్చిందని చెప్పవచ్చు.