హీరోయిన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి అర్చన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ వన్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి టాప్ ఫైవ్ లో నిలిచి తన సత్తాను చాటుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా అర్చన ఒక ఇంటర్వ్యూలో తనకు ఎదురైన పలు చేదు సంఘటనల గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ.. తను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని,తనని ఒక తెలుగు డైరెక్టర్ నానా హింసలు పెట్టేవాడని తెలిపింది. ఒక డైరెక్టర్ ఉన్నాడు అతడు రోజుకు ఒకసారి డైలాగ్ మార్చేస్తాడు, రోజుకో స్క్రిప్ట్ మార్చేస్తాడు.అతన్ని చూసిన తరువాత మనుషులు ఇలా కూడా ఉంటారా అని అభిప్రాయపడ్డానని ఆమె తెలిపింది. అతడు మూవీ షూటింగ్ సెట్లోకాస్త డిఫరెంట్ గా ఉండేవాడు.
అతని టార్చర్ భరించలేక ఎక్కడ సినిమాలు వదిలేస్తానని అని అమ్మా, నేను నిన్ను కలుస్తాను, ఇంటికి వచ్చి మాట్లాడతాను అంటూ ఆమెతో మాటలు కలిపే వాడట. అలా ఒకసారి అతడు అర్చన ఇంటికి వచ్చినప్పుడు మీరు చెప్పింది ఒకటి..చేస్తుంది మరొకటి ఇది కరెక్ట్ కాదు సార్ అని చెప్పిందట. అనంతరం అతను మళ్లీ కాకమ్మ కబుర్లు చెప్పేవాడట. ఆ మాటలు విన్న అర్చన తానే తప్పుగా ఆలోచిస్తున్నాను ఏమో అనుకొని మళ్లీ షూటింగ్ కు వెళ్లలేదట.
ఒకసారి షూటింగ్లో అతని ప్రవర్తనతో విసిగిపోయిన అర్చన నువ్వు నాకు పైసా కూడా ఇవ్వకని ఆ డైరెక్టర్ ముఖం మీద చెప్పేసి ఆ ప్రాజెక్టు ను రిజెక్ట్ చేసిందట. ఇది సంఘటన జరిగి కొన్ని ఏళ్లు అవుతోంది. అతను ఇప్పుడు అందరికీ తెలిసిన హీరో కానీ పెద్దగా సక్సెస్ ఫుల్ హీరో కాలేదు అని ఆమె తెలిపింది. చూడటానికి చాలా సింపుల్ గా సాదాసీదాగా ఉంటారు కానీ అది అతడి నిజ స్వరూపం అది కాదని ఆమె తెలిపింది. అంతేకాకుండా అతడి చూపులు చాలా వంకరగా ఉండేవి అంటూ ఈ సందర్భంగా అర్చన అతని స్వభావం గురించి తెలిపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…