తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు బుల్లి తెరకు పరిచయం అయ్యారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుని, వెండి తెరపై కూడా అవకాశాలు సంపాదించిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటివారిలో గెటప్ శీను, సుడిగాలి సుదీర్, మహేష్ లాంటి వారు ఉన్నారు.
అయితే ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ లో వారి కామెడీ పంచ్ లతో నవ్విస్తున్న ఈ కమెడియన్ లు ఒకప్పుడు తిండి తిప్పలు లేక చాలా అవస్థలు పడ్డారట. ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన కటికదారిద్ర్యాన్ని అనుభవించారట. హైపర్ ఆది సుడిగాలి సుదీర్, హైపర్ ఆది వీరందరూ కూడా ఎన్నో కష్టాలు పడి ప్రస్తుతం కామెడీయన్ లుగా మంచి గుర్తింపును ఏర్పరుచుకున్నారు.
అలా జబర్దస్త్ కమెడియన్ వేణు కూడా ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాడట. కమెడియన్ వేణు గురించి మనందరికీ తెలిసిందే. మొదట్లో బాగా కామెడీ చేస్తూ పంచులు వేస్తూ నవ్వించిన వేణు నిదానంగా జబర్దస్త్ దూరమయ్యారు. వెండితెరపై కూడా ఎన్నో సినిమాలలో నటించాడు. శ్రీను, సుధీర్ ని జబర్దస్త్ కు పరిచయం చేసింది వేణునే. జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత వేణు పలురకాల షో లలో నటించాడు.
అయితే ఇండస్ట్రీకి రాకముందు వేణు చాలా కష్టాలను పడ్డారట. ఇండస్ట్రీకి రావాలనే కోరికతో తెలిసిన వాళ్ల ద్వారా హైదరాబాద్ కు వచ్చి సెట్ బాయ్ గా కూడా పని చేశాడట. అందుకు 70 రూపాయలను ఇచ్చేవారట. అనంతరం మరికొంతమంది దర్శకుల దగ్గర పని చేశాడట. ఈ నేపథ్యంలోనే వాళ్ల బాత్రూమ్ లు కడగడమే,కాకుండా వాళ్ళు తిన్న కంచాలు కూడా అడిగానని చెప్పుకొచ్చాడు వేణు. అలా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ చివరికి జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ఇక ప్రస్తుతం అక్కడక్కడా పలు ఈవెంట్ లో దర్శనమిస్తున్నాడు. బుల్లితెర పైకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు వేణు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…