వాళ్ళకి సరైన మొగుడు జగనేనంట.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు..!!!

మెగా బ్రదర్స్ లో నిర్మొహమాటంగా ఏదైనా మాట్లాడే వ్యక్తిగా నాగబాబు కనిపిస్తారు. గతంలో తన ఫ్యామిలీ జోలికివచ్చిన ఎవరిని కూడా నాగబాబు అంత ఊరికే వదిలిపెట్టలేదు.. బుల్లితెర రారాజు గా పది సంవత్సరాలు ఏలిన నాగబాబు ఇప్పుడు చేతిలో షో లు, సీరియల్ లు లేక ఖాళీగా ఉన్నాడు. ఇటీవలే కూతురు నిహారిక పెళ్లి ఎంతో ఘనంగా చేసిన నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ నిర్వహణలో ఉన్నాడు షో లపై ఏమాత్రం కాన్సంట్రేట్ చెయ్యట్లేదు. తన ఫ్యామిలీ పై విమర్శలు చేసే వారికి తగిన సమాధానం ఇచ్చి మరీ వాళ్లకు బుద్ధి చెప్పారు.

తమలో తమకు వంద ఉంటాయని అలా అని బయటివారు వచ్చి తమని ఏమన్నా అంటే ఊరుకోమని అయన మీడియా ముందు కూడా చాలా సార్లు చెప్పారు. ఎంతకాదన్నా మిగితా ఇద్దరు బ్రదర్స్ లాగా నాగబాబు వారి రేంజ్ కి చేరుకోలేకపోయారు.. చిరు మెగా స్టార్ అయితే , పవన్ పవర్ స్టార్ అయ్యారు..కానీ నాగబాబు టవర్ స్టార్ గానే మిగిలిపోయారు.. ఆమధ్య చిత్ర నిర్మాతగా ఓ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. దాంతో బుల్లితెర దారి పట్టిన నాగబాబు అక్కడ బాగానే సంపాదించి మళ్ళీ గెట్ ఇన్ అయ్యాడు.

కొడుకు వరుణ్ తేజ్ కూడా హీరో కావడంతో ఆయనకున్న ఆర్థిక కష్టాలు తీరిపోయాయి. ఇకపోతే ఇటీవలే అయన సోషల్ మీడియా లో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజగా కూడా జగన్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన ఇంస్టా రీల్ లో ఓ జగన్ అభిమాని అడిగిన ప్రశ్న కి సమాధానం ఇచ్చారు. ఆ అభిమాని జగన్ జోలికి వస్తే ఊరుకోము, ఆయన మాకు దేవుడు అని చెప్పగా ఎంపీ గా జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయినా నాగబాబు సమాధానం ఇస్తూ మీకు ఆయనే సరైన మొగుడు అనే చమత్కారంగా సమాధానం ఇచ్చాడు.. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలో మరీ..