Nagarjuna: కొంచమైనా మానవత్వం ఉందా.. ట్రోల్స్ కి గురైన నాగార్జున.. క్షమాపణలు చెప్పిన హీరో!

Nagarjuna: సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక నాగార్జున తన సినిమాల వరకు తాను బిజీగా ఉంటారు తప్ప ఇతర విషయాల గురించి పెద్దగా కల్పించుకోరు. అంతేకాకుండా ఈయన సోషల్ మీడియాకి కూడా చాలా దూరంగా ఉంటారు.

ఇలా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే ఈయన అత్యవసరమైతే తప్ప ఆయా సంఘటనలపై స్పందించరు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా నాగార్జున భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఇలా ట్రోల్స్ కి గురి కావడంతో వెంటనే నాగార్జున క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అసలు నాగార్జున క్షమాపణలు చెప్పడం ఏంటి? ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. నాగార్జున ఇటీవల ఎయిర్ పోర్ట్ లో కనిపించారు సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే అభిమానులు వారితో సెల్ఫీ తీసుకోవడం కోసం వెళ్తారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడం కోసం వెళ్లగా అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆయనని తోసేసారు దీంతో ఆ అభిమాని ఒక్కసారిగా కింద పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపై జరగవు.
ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నాగార్జున పై ట్రోల్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో నాగార్జున స్పందించి క్లారిటీ ఇచ్చారు.. ఈ విషయం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది అలా ఒక వ్యక్తిని తోయటం సరైంది కాదు ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము అంటూ నాగార్జున ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.