Pawan Kalyan: నిర్మాతల డబ్బుతో పార్టీ ప్రచారం… గ్లాస్ డైలాగ్స్ పై నెటిజెన్స్ సెటైర్స్?

Pawan Kalyan: ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే వారు. ఇక అభిమానుల సంగతి చెప్పాల్సిన పనిలేదు పెద్ద ఎత్తున అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమా వస్తే చేసే హంగామా మాటల్లో వర్ణించలేనిది అయితే ఇటీవల కాలంలో ఈయన ఫోకస్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పాలి.

పవన్ కళ్యాణ్ సినిమాలను సినిమాలుగా కాకుండా రాజకీయాలను రాజకీయాలుగా కాకుండా రెండిటిని కలిపి చేయటంతో ఎటు కాకుండా పోతున్నారు. ఈయన సినిమాలలో తన రాజకీయ పార్టీకి సంబంధించిన డైలాగ్స్ పెడుతూ ప్రజలచేత చీ కొట్టించుకుంటున్నారు. ఇలా అటు సినిమాలకు ఇటు రాజకీయాలకు కాకుండా ఉన్నారు.

ఇకపోతే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలలో ఎక్కువగా రాజకీయానికి సంబంధించినటువంటి సన్నివేశాలు అధికమవుతున్నాయి. ఇటీవల బ్రో సినిమాల్లో కూడా ఈయన తన ప్యాకేజీ పాలిటిక్స్ చూపించారు అయితే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా మరోసారి ప్యాకేజీ పాలిటిక్స్ చూపించారు.

గ్లాస్ అంటే సైన్యం..
గ్లాస్ పగిలే కొద్ది పదునెక్కువ గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ ఈయన చెప్పిన డైలాగ్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేటిజన్స్ ఈ డైలాగ్ లు వేస్తున్నారు అసలు ఇది సినిమా కోసం చేసావా లేకుంటే నీ పార్టీ ప్రచారం కోసం చేసుకున్నారా అంటూ కామెంట్లో చేస్తున్నారు. ఆయన పాలిటిక్స్ విషయంలో పవన్ కి ఎవరు సాటిరారని తన సొంత డబ్బు ఖర్చు కాకుండా నిర్మాతల చేత డబ్బు ఖర్చు పెట్టి పార్టీ ప్రచారం చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.