Pawan Kalyan: ఆకీరా ఆద్య మెగా వారసులు కారా.. ఇంటి పేరును మార్చేసిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే జనసేన పార్టీని స్థాపించినటువంటి ఈయన ప్రస్తుతం పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికలలో పోటీ చేయబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవల నామినేషన్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఎన్నికల అఫిడవిట్ లో భాగంగా వారి పూర్తి సమాచారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విషయాలను గురించి తెలియజేస్తూ తన పిల్లల పేర్లను మార్చేశారు. దీంతో ఈ విషయం కాస్తా సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సినీ నటి రేణు దేశాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు అయితే పిల్లలు జన్మించిన తర్వాత రేణు దేశాయ్ కి విడాకులు ఇవ్వడంతో పిల్లలు కూడా తన తల్లి వద్దే ఉంటున్నారు.

ఇలా రేణు దేశాయ్ ఈ కుటుంబం నుంచి దూరంగా ఉన్నప్పటికీ తన పిల్లలను మాత్రం ఎప్పటికప్పుడు మెగా కుటుంబానికి దగ్గర చేస్తున్నారు మెగా కుటుంబంలో జరిగే ఈవెంట్లకు వీళ్ళ హాజరవుతున్నారు. ఇక అకీరా ఆద్య ఇద్దరిని కూడా మెగా వారసులుగానే భావిస్తూ ఉంటారు.

ఇంటిపేరు మార్చిన పవన్..
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మాత్రం వీరి ఇంటి పేరులను మార్చుతూ ఎన్నికల అఫీడవిట్లో పేర్కొనడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. తన పిల్లల పేర్ల గురించి పవన్ కళ్యాణ్ రాస్తూ కొణిదెల అకీరా నందన్ అని కాకుండా అకీరా దేశాయ్ ఆధ్యా దేశాయ్ అని రాసుకొచ్చారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఇలా పిల్లల పేర్లను మార్చడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.