Pawan Kalyan: ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన పవన్ కళ్యాణ్… ప్రభాస్ అభిమానుల మనసు గెలిచారుగా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వారాహి యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలలో పర్యటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన భీమవరంలో పర్యటించడమే in కాకుండా ఈ యాత్రలో భాగంగా ఈయన ప్రభాస్ అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సభకు వెళ్లిన తన తోటి హీరోల గురించి మాట్లాడుతూ వారి అభిమానుల మనసు కూడా గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పలు సందర్భాలలో ప్రభాస్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్, మహేష్ బాబు వంటి హీరోల ప్రస్తావన తీసుకువస్తూ తనకు ఈ హీరోలంటే చాలా ఇష్టమని వారు నాకన్నా పెద్ద స్టార్స్ అంటూ వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఈ విధంగా తన అభిమానులను మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులను కూడా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా భీమవరంలో మాట్లాడుతూ…గతంలో తన అభిమానులకు ప్రభాస్ అభిమానులకు ఒక పోస్టర్ విషయంలో గొడవ జరిగిందని ఈ సందర్భంగా ఈయన గుర్తు చేశారు.ఒక పోస్టర్ చినిగిపోయిన విషయం చాలా చిన్నది ఈ గొడవను పెద్దది చేయకూడదు.క్షమించి వదిలేయమంటూ చేతులు జోడించి వేడుకుంటున్నానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

Pawan Kalyanతోటి హీరోలపై పవన్ ప్రశంసలు…


ఈ విధంగా పవన్ కళ్యాణ్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పడంతో ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులు పవన్ కళ్యాణ్ మాటతీరుకు ఫిదా అయ్యారు. దీంతో ఈయన ప్రభాస్ అభిమానుల మనసు గెలుచుకున్నారని చెప్పాలి. ఇలా స్టార్ హీరోల పట్ల ఈయన పొగడ్తలు కురిపించడంతో ఇప్పటికే పవన్ సభలకు పెద్ద ఎత్తున ఇతర హీరోల అభిమానులు కూడా తరలివస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే.