రేగు పండ్లు తినేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సింది..!

రేగుపండ్లు శీతాకాలంలో విరివిగా లభించే పండ్లలో ఒకటని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పండ్లను భోగి రోజు చిన్న పిల్లలపై వేయటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి పిల్లల్ని కాపాడుతుందని భావిస్తారు. అందుకే భోగి రోజు భోగి పళ్ళగా వీటిని పిల్లలపై పోయడం అనాదిగా వస్తున్న ఆచారంగా భావిస్తారు. రుచికి తీపి,పులుపు కలిపినట్టు ఉన్న ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ రేగు పళ్ళు చెట్టు నుంచి మొదలుకుని ప్రతి ఒక్కటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే రేగి పండ్లను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం.

ఈ రేగు పండ్లలో ఎక్కువగా విటమిన్ సి, ఏ, పొటాషియం అధికంగా లభిస్తాయి. విటమిన్ సి మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విటమిన్ ఏ వల్ల ఎటువంటి కంటి సమస్యలు లేకుండా కాపాడుతుంది. ఇవే కాకుండా రేగుపళ్లులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ రేగు పండ్లను తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.అదేవిధంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రేగు పండ్లను తినడం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

డయేరియా, నీళ్ల విరోచనాలు వంటి సమస్యతో బాధపడేవారు రేగు పండ్ల చెట్టు బెరడును తీసి కషాయం తయారుచేసి తాగించడం వల్ల తొందరగా ఈ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. అదేవిధంగా చర్మ అలర్జీలు ఉన్నవారు రేగుపళ్ళు ఆకును మెత్తగా రుబ్బి అంటించుకోవడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రేగు పండు విత్తనాలను బాగా ఎండబెట్టి పొడిచేసి నూనెలో కలిపి రాసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది. కానీ ఎర్రగా పండిన రేగుపండ్లను తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.పచ్చి రేగు పండ్లను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది.