AP Election Result: ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమిదే విజయం.. పీకే సంచలన వ్యాఖ్యలు?

AP Election Result: ఏపీ ఎన్నికలు మే 13వ తేదీ జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో అందరి ఆసక్తి ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే విషయంపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠత నెలకొంది.

గత ఎన్నికలలో పోలిస్తే ఈ ఎన్నికలలో పోలింగ్ శాతం భారీగా నమోదు అయినది. దీంతో తప్పకుండా కూటమి అధికారంలోకి వస్తుందని ప్రభుత్వం పై వ్యతిరేకతతోనే ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేశారని తెలుస్తుంది కానీ వైసీపీ అధినేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి అందించిన పరిపాలన చూసి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి మరీ పట్టం కట్టాలని ఇలా ఓట్లు వేశారని భావిస్తున్నారు.

ఇలా ఎవరికివారు విజయం తమదే అని భావిస్తున్నటువంటి తరుణంలో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ఫలితాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఐపాక్ వారితో సమావేశమైన తర్వాత గతంలో కంటే ఈసారి మరింత అధిక మెజారిటీతో గెలవబోతున్నామని వెల్లడించారు. కానీ ఆయన అంత ధీమా వ్యక్తం చేసిన గెలుపు మాత్రం అందుకోలేరని ఈసారి కూటమిదే గెలుపు అంటూ ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.

జగన్ రావడం కష్టమే…

సీఎం జగన్ తమదే అధికారం అని చెబుతున్నా కానీ ఆయన మాత్రం ఎలాంటి పరిస్థితులలోనూ గెలవరని తప్పకుండా ఆంధ్ర ప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుందని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాగ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.