YS Jagan: వైయస్ జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలను కూల్చిన అధికారికి ప్రమోషన్!

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండులో నివాసం ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో లోటస్ పాండ్ నివాసం ముందు అక్రమంగా కట్టడాలను నిర్మించారంటూ తెలంగాణ ప్రభుత్వం ఆక్రమ కట్టడాలను కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ లోటస్ పాండులోని నివాసం వద్ద బయట సెక్యూరిటీ కోసం మూడు షెడ్లను నిర్మించారు. అయితే ఇవి అక్రమంగా నిర్మించారని ఆ నిర్మాణాల వల్ల రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వాటిని కూల్చివేశారు. ఇలా ఆ అక్రమ కట్టడాలు అంటూ కూల్చివేయడంతో వెంటనే ఐఏఎస్ అధికారి హేమంత్ పై సస్పెన్షన్ వేటు పడింది.

ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆయన దగ్గరుండి ఈ కట్టడాలను కొల్చివేశారు అయితే తన పై అధికారులకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా కూల్చి వేయడం పట్ల ఆయనపై ప్రభుత్వం వేటు వేసింది. ఇలా సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనకు ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది.

సస్పెండ్ అయిన అధికారికి ప్రమోషన్..
ఇకపోతే తాజాగా జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి హేమంత్ సస్పెండ్ కావడంతో తిరిగి ఈయనకు పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఈయనని ప్రమోట్ చేస్తూ పోస్టింగ్ ఇవ్వడంతో మరోసారి ఈ విషయం చర్చలకు దారితీస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం హేమంత్ కి వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సమస్త ఎండిగా ప్రమోట్ చేస్తూ పోస్టింగ్ ఇవ్వడం విశేషం.