Punch Prasad: పంచ్ ప్రసాద్ కి అండగా నిలిచిన జగన్ సర్కార్… సర్జరీకి ఏర్పాట్లు?

Punch Prasad: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పంచ్ ప్రసాద్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈయనకు రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ కావడంతో తరచూ డయాలసిస్ చేయించుకుంటున్నారు అయితే రోజురోజుకీ ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. అయితే సర్జరీ చేయించడం కోసం సరైన డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు.

ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ కి త్వరగా సర్జరీ చేయాలి అని లేకపోతే పెద్ద ప్రమాదం జరుగుతుంది అంటూ ఈయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ మరొక కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని చేయడమే కాకుండా తనకు డబ్బు సహాయం చేయాలి అంటే ఫోన్ పే గూగుల్ పే నెంబర్లను కూడా ఈ వీడియోలో పొందుపరిచిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ కి సరైన ఆరోగ్య అందేలా చూడాలని సర్జరీకి అవసరమైన సదుపాయాలను తనకు కల్పించాలంటూ మంత్రి ఆర్కే రోజా సీఎం రిలీఫ్ ఫండ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కమెడియన్ ప్రసాద్ కి వైద్య సదుపాయాలను అందించాలని సూచించారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నటువంటి ఈయనకు ఏపీ సీఎంఓ ద్వారా సహాయం అందుతుంది.

Punch Prasad: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం


ఇదివరకే ఒక నేటిజన్ఈ వీడియోని ముఖ్యమంత్రి సహాయనిది కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణ టాగ్ చేయగా ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇప్పటికే తాము ప్రసాద్ కుటుంబ సభ్యులను అప్రోచ్ అయ్యామని ఆయన చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ప్రసాద్ వైద్య చికిత్సకు ఏపీ ప్రభుత్వం అండగా నిలవడం విశేషం.