Ramcharan: బాబాయ్ పవన్ కోసం పిఠాపురం ల్యాండ్ అయిన అబ్బాయి!

Ramcharan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కోసం ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పిఠాపురం చేరుకొని గత నెల రోజులుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈయన కోసం నాగబాబు కుటుంబ సభ్యులు మొత్తం పిఠాపురంలోనే ఉన్నారు.

సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ తన మామయ్యను గెలిపించాలని కోరారు. ఇక నేటితో ప్రచార కార్యక్రమాలు పూర్తికానున్నాయి. ఇక ప్రచార కార్యక్రమాలు పూర్తికానున్న తరుణంలో బాబాయి కోసం అబ్బాయి రామ్ చరణ్ కూడా పిఠాపురం చేరుకున్నారు.

నేడు ఉదయం ఈయన తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం చేరుకున్నటువంటి రామ్ చరణ్ పలు ఆలయాలలో స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేయించి పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం పిఠాపురంలో ఎన్నికల పర్యటనలను నిర్వహించారు. ఇక రాంచరణ్ వస్తున్నారనే విషయం తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

పవన్ కి ఎదురు లేదు..
ఇక ఈయనకు ఘన స్వాగతం పలకడం కోసం విమానాశ్రయానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వెళ్లారు. అడుగడుగున అభిమానులు రామ్ చరణ్ కు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు ఎదురులేదని స్పష్టంగా తెలుస్తోంది.