Ramcharan: రామ్ చరణ్ RC 15 కు తప్పని లీకుల బెడద.. తలలు పట్టుకుంటున్న చిత్ర బృందం!

Ramcharan: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేయాలంటే కొన్ని వందల మంది కార్మికులు కొన్ని నెలల పాటు లేదా కొన్ని సంవత్సరాల పాటు ఒక సినిమా కోసం కష్టపడుతూ పనిచేస్తుంటారు. ఇలా సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకు చెప్పకుండా ఎంతో రహస్యంగా సినిమాలను చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున సినిమా షూటింగులు నుంచి కొన్ని సన్నివేశాలు లీక్ అవ్వడం జరుగుతుంది.

ఇప్పటికే ఈ విధంగా లీక్ చేసే వారికి మేకర్స్ తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చినప్పటికీ లీకు రాయుళ్లు మాత్రం తగ్గేదేలే అన్నట్టు ప్రతి ఒక్క సినిమాకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో లీక్ చేస్తూ ఉన్నారు. ఇలా సోషల్ మీడియాలో సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ లీక్ అవడంతో మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న RC 15 సినిమా విషయంలో ఇలాంటి లీకుల బెడద అధికంగా ఉంది.

ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా షూటింగ్ లోకేషన్ లో నుంచి రామ్ చరణ్ కు సంబంధించిన ఎన్నో లుక్స్ బయటకు వచ్చాయి. దీంతో ఎలాగైనా ఈ లీకులను ఆపాలని మేకర్స్ ప్రయత్నం చేసిన ఏమాత్రం తగ్గడం లేదు.

Ramcharan: రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద….

ఈ క్రమంలోనే తాజాగా రామ్ చరణ్ ఓ పార్టీ కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభను నిర్వహిస్తూ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ క్రమంలోనే ఈ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవడంతో క్షణాల్లో ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.ఇలా తరచూ సినిమాకు సంబంధించిన విషయాలు లీక్ కావడంతో రామ్ చరణ్ తో పాటు ఇతర చిత్ర బృందం ఈ విషయంలో ఎంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నుంచి లీక్ అయినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.