Pawan Kalyan: రామోజీరావు ఆ మాట విన్న తర్వాతే మరణించారు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: రామోజీరావు పరిచయం అవసరం లేని పేరు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేతగా ఎన్నో వ్యాపారాలను ప్రారంభించి ఎంతో మంచి విజయం సాధించిన ఈయన ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా రామోజీరావు మరణించడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో రామోజీరావు సంస్కరణ సభను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ అలాగే ఇతర రాజకీయ నాయకులు పలువురు సినీ ప్రముఖులతో పాటు రామోజీరావు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను రామోజీరావుని కలిసినప్పుడు నాకు ఆయన ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేశారు.. ఏం చేస్తావో.. ఏం నమ్ముతావో త్రికరణ శుద్దిగా చేయి అని నాకు రామోజీరావు సూచించారని పవన్ వెల్లడించారు. జర్నలిస్టు విలువలను కాపాడిన రామోజీరావు పత్రికాధిపతిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, ఆయన కుటుంబ సభ్యులను బెదిరించినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు.

రామోజీ విగ్రహం ఏర్పాటు చేయాలి..
ఇలా నిలబడటానికి కూడా చాలా ధైర్యం కావాలని పవన్ తెలిపారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నటువంటి తరుణంలో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది అయితే ఈ శుభవార్తను ఆయన విన్నారా లేదా అనే విషయాన్ని నేను కనుక్కున్నాను అయితే కూటమి అధికారంలోకి వచ్చిందనే విషయం ఆయన విన్న తర్వాతనే మరణించారు అంటూ పవన్ తెలిపారు. ఇలాంటి ఓ మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పవన్ కోరారు.