రతన్ టాటాను రాష్ట్రపతిని చేయండి.. నాగబాబు కోరిక..!

భారత దేశం ప్రస్తుతం కొంత అనూహ్యమైన పరిణామాలకు ఎదుర్కొంటుంది. దీనికి ఒక విజన్ తో ముందుకు నడిపే నాయకుడు కావాలి. భారత దేశానికి తదుపరి రాష్ట్రపతిగా తాను రాతన్ టాటాను ప్రతిపాదిస్తున్నాను.. మీరు ఏమంటారు..మీరు ఒప్పుకుంటారా అంటూ.. కొణిదెల నాగబాబు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పడు వైరల్ గా మారింది. వ్యూహ రచనతో ముందుకు నడిపే నాయకుడి లక్షణాలు రతన్ టాటాకు ఉందంటూ ప్రస్తావించారు.

భారతదేశంలో ప్రతీ ఒక్కరినీ ఒకే విధంగా చూసినప్పుడే దేశ అభివృద్ది సాధ్యం అవుతుందన్నారు. దీనికి అభిమానులు, నెటిజన్లు వివిధ రకాలుగా సమాధానాలు సమాధానం ఇచ్చారు. తాము మీ ప్రతిపాదదను అంగీకరిస్తున్నాం అంటూ కొందరు.. పోస్ట్ చేస్తే..మరి కొందరు నెగెటివ్ గా పోస్ట్ చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతిగా మిమ్మల్ని(నాగబాబును) ప్రతిపాదిస్తున్నామంటూ మరి కొందరు వ్యగ్యంగా సమాధానం ఇచ్చారు. చాలా వరకు నాగబాబు పోస్ట్ చేసిన దానికి అంగీకరిస్తున్నట్లు కామెంట్ తెలిపారు.

ఇటీవల కాలంలో బీజేపీలో కురు వృద్దులు ఉన్నా తదుపరి రాష్ట్రపతిగా వాళ్లను పరిగణలోకి పీఎం మోడీ తీసుకోవడం కష్టమేననే సంకేతాలు వినపడుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండే వ్యక్తిని రాష్ట్రపతిగా చేసే ఆలోచన కూడా మోదీకి ఉన్నట్లు సమాచారం.

దేశ వ్యాపార రంగంలో దిగ్గజంగా పేరు పొందిన రతన్ టాటాను రాష్ట్రపతిగా చేస్తే బాగానే ఉంటుందని మోదీ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రతన్ టాటాతో పాటు ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి , సూపర్ స్టార్ రజినీ కాంత్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు నాగబాబు ఆకాంక్ష కూడా రతన్ టాటా రాష్ట్రపతి కావాలనే కోరుకుంటున్నారు. మరి నాగబాబు కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.