నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పదార్దాలు తీసుకోండి!

మనం సరైన ఆరోగ్యం పొందాలంటే పోషక విలువలతో కూడుకున్న ఆహారం మాత్రమే కాకుండా సరైన నిద్ర ఉన్నప్పుడే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలము. కానీ చాలా మంది వారి రోజువారి పనులలో కలిగే ఒత్తిడి, ఆందోళన, కొన్ని కుటుంబ సమస్యల కారణంగా నిద్రలేమి ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధంగా నిద్ర లేని కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమస్య నుంచి మనం విముక్తి పొందాలంటే తప్పనిసరిగా కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు. మరి ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

  • నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి అరటిపండ్లు ఈ సమస్య నుంచి విముక్తి కల్పిస్తాయని చెప్పవచ్చు. అరటి పండ్లలో విటమిన్‌ బి6 ఉంటుంది. ఈ విటమిన్ కారణంగా మెలటోనిన్ హార్మోన్ పెరుగుతుంది. దీంతో మెదడుకు నిద్ర పోవాలనే సమాచారాన్ని పంపించడంతో మనకు నిద్ర కలుగుతుంది.
  • నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి బాదంపప్పు ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. బాదం పప్పు ఎన్నో పోషకాలకు నిలయం అని చెప్పవచ్చు.ప్రతిరోజూ పడుకునే ముందు నాలుగు బాదం పప్పులు తినడం వల్ల మన శరీరంలోని కండరాలకి విశ్రాంతి కలిగి నిద్రపోవడానికి దోహదపడతాయి.
  • ఒత్తిడి, నీరసం కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధంగా ఒత్తిడితో బాధపడేవారు పడుకోవడానికి అరగంట ముందు పాలలో కొద్దిగా గసగసాలు కలుపుకొని తాగడం వల్ల హాయిగా నిద్ర పోతారు.ఈ విధమైనటువంటి నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.