బ్రేకింగ్ న్యూస్ : రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి..!

కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య ఈరోజు ఉదయం మరణించారు. ఆరోగ్యం విషమించడంతో పదిరోజుల క్రితం నెల్లూరు జిజిహెచ్ లో చేరిన కోటయ్య గత 4 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.

కరోనా సోకిన తరువాత కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందును తీసుకున్నారు కోటయ్య. ఆ సమయంలో కోటయ్య వీడియో వైరల్ అయింది. కోటయ్య వీడియో తో ఆనందయ్య మందు వెలుగులోకి వచ్చింది. అయితే ఆ తరువాత అకస్మాత్తుగా ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో, ఆసుపత్రిలో చేరారు. చికిత్సపొందుతూ ఈరోజు తుడిశ్వాస విడిచారు కోటయ్య.