మంగళ సూత్రంలో పొరపాటున కూడా పిన్నీసులు వేసుకోకూడదు ఒకవేళ వేస్తే..?

మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పెళ్లైన తరువాత స్త్రీ మెడలో ఎల్లప్పుడు మంగళ సూత్రాలను ధరించి ఉంటారు. మన భారతదేశంలో జరిగే వివాహాలలో మొదటి ప్రాధాన్యత మాంగల్యానికి ఉంటుంది. ఈ విధంగా మన దేశ ఆచార వ్యవహారాలు ఇతర దేశాలకు ఎంతో నిదర్శనంగా ఉంటాయని చెప్పవచ్చు. పెళ్లి అయిన స్త్రీ భర్త అడుగుజాడల్లో, తన తోడునీడగా నడుస్తుంది. తన భర్త ఆరోగ్యంగా దీర్ఘాయుష్షు ఆ మంగళసూత్రంలో ఉంటుందని భావిస్తోంది.

ఇంత ప్రాముఖ్యత ఉన్న మంగళ సూత్రాలను ప్రస్తుత కాలంలో ఒక ఆభరణంగా మాత్రమే ధరిస్తున్నారు. అయితే కొంతమంది మహిళలు మంగళ సూత్రాలలో పిన్నీసులు పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది. ఈ విధంగా పిన్నీసులు పెట్టుకోవడం ద్వారా మంగళ సూత్రాలకు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం ఏర్పడుతుంది. ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ మంగళసూత్రానికి రావడం వల్ల ఆ భార్య భర్తల దాంపత్య జీవితంలో మనస్పర్ధలు చోటుచేసుకుంటాయి. అందుకోసమే మంగళసూత్రాలలో పిన్నీసులు వేసుకోకూడదని చెబుతుంటారు.

మంగళ సూత్రాలను ఎంతో పరమపవిత్రంగా పూజించుకోవాలి. అప్పుడే ఆ మహిళ నిండు ముత్తైదువ గా ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో మంగళ సూత్రాలను నల్లపూసలలో ధరించి వేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా నల్లపూసలలో మంగళ సూత్రం ధరించడం కూడా మంచి పద్ధతి కాదని పండితులు తెలియజేస్తున్నారు.మన హిందూ సాంప్రదాయాలలో పాటించే ప్రతి ఒక్క కార్యం వెనుక అర్థం పరమార్థం దాగి ఉంటుంది. అటువంటి ఆచార నియమాలను పాటించడం ద్వారా ఎన్నో సమస్యల నుంచి మనం విముక్తి పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.