Sangeetha : ఈ హీరోయిన్ కి మొదటి సినిమా హిట్.. కానీ అదే ఆమె కెరియర్ కు శాపంగా మారిందని తెలుసా.?!

సినిమా ఓ రంగుల ప్రపంచం.. ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంత సేపు తనను తానే మర్చిపోతాడు. వెండితెరపై ఒక్కసారైనా తనను చూసుకోవాలని ఊహల్లో ఊగిసలాడుతాడు. అలా చిన్నప్పుడు స్కూల్లో చిన్న నాటకాలు వేస్తున్న క్రమంలో స్నేహితుల సలహాపై… ఎలాంటి సినీ పరిచయాలు లేకున్నా ‘లత’ తన సోదరుడితో మద్రాస్ రైలు ఎక్కింది. తీరా అక్కడికి వెళ్ళాక సినిమా కష్టాలు ఆమెకు మొదలయ్యాయి. సోదరుడు తన అక్క ‘లత’ ఫోటోలు తీసుకొని స్టూడియోల చుట్టూ తిరగడం ప్రారంభించాడు.

Sangeetha : ఈ హీరోయిన్ కి మొదటి సినిమా హిట్.. కానీ అదే ఆమె కెరియర్ కు శాపంగా మారిందని తెలుసా.?!

అలా మొదటగా నిర్మాత దర్శకుడు యు.విశ్వేశ్వర రావు ‘లత’ ఫోటోలు చూసి తను తీయబోయే ‘తీర్పు’ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఆయన ‘లత’ పేరును కాస్తా ‘సంగీత’ గా మార్చడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో సంగీత ‘బాపు’ దర్శకత్వంలో వచ్చిన “ముత్యాలముగ్గు” సినిమాలో నటించింది. మొదటిరోజు సంగీతతో ఎలాంటి మేకప్ లేకుండా షూటింగ్ ప్రారంభించారు. సినిమా షూటింగ్ అంటే మంచి డ్రెస్సులు వేసుకొని అందంగా తయారు కావడం… అనుకున్న సంగీతకు మేకప్ లేకుండా నటించడం ఆశ్చర్యం అనిపించింది. బాపు తన సినిమాలలో హీరోయిన్లను సహజసిద్ధంగా చూపించడంలో దిట్ట. ఆ క్రమంలో దర్శకుడు బాపు సంగీతకు మేకప్ లేకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా నటింపచేశారు.

బాపు లాంటి దర్శకుడి సినిమాలో నటించడం ఆమె ఒక అదృష్టంగా భావించింది. అలా “తీర్పు” సినిమా కంటే ముందే ‘ముత్యాలముగ్గు’ సినిమా 1975లో విడుదలైంది. మంచి కథతో వచ్చిన ‘ముత్యాలముగ్గు’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. కుటుంబ కథతో వచ్చిన ఈ సినిమాలో.. సంగీత ఒక విధంగా చెప్పాలంటే డీగ్లామర్ గా కనిపించింది. ఆ తర్వాత చాలా మంది దర్శకులు సంగీతను అలాంటి పాత్రలకు తీసుకోవడం ప్రారంభించారు. ఈ సినిమా తరువాత వచ్చిన “తాయారమ్మ బంగారయ్య” చిత్రంలో గ్లామర్ రోల్ లో మాధవి నటించగా.. పల్లెటూరి గృహిణి పాత్రలో “సంగీత” నటించారు.

ఆ తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన “నకిలీ మనిషి” చిత్రంలో మరొక గృహిణి పాత్రలో హీరోయిన్ గా కనిపించారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ నటించిన చిత్రాల్లో గ్లామరస్ హీరోయిన్స్ అవసరమున్న ‘సంగీత’ కు ఎలాంటి ఆఫర్స్ రాలేదు. ఆ విధంగా ఆనాటి స్టార్ హీరోల బ్లాక్ బస్టర్స్ లో హీరోయిన్ గా సంగీతకు అవకాశం లేకుండా పోయింది. నిజం చెప్పాలంటే ఆమె ఉజ్వలమైన సినీ భవిష్యత్తుకు “ముత్యాలముగ్గు” వంటి సినిమా ఓ శాపంగా మిగిలిపోయింది. ముత్యాలముగ్గు సినిమా తనకు ఎంత పేరు తీసుకు వచ్చిందో తన భవిష్యత్తుకు అంత నష్టాన్ని కూడా కలిగించిందని సంగీత ఇప్పటికీ బాధపడుతుంటారు