స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు..

నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమౌతున్న అభ్యర్ధులకు ఉత్సాహాన్నిచ్చే వార్త. దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయనుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది. మొత్తం పోస్టులు 2056 ఉన్నాయి. ఇందులో రెగ్యులర్ 2 వేల పోస్టులు కాగా బ్యాక్‌లాగ్ పోస్టులు 56 ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హత ఏంటి, ఎలా దరఖాస్తు చేయాలి, పరీక్ష ఎప్పుడుంటుందనే వివరాల్ని ఎస్బీఐ ప్రకటించింది.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. 2021 ఏప్రిల్ 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య వయస్సుండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.

ఎంపిక మూడంచెల విధానంలో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్, ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కేవలం ఆన్ లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేటి నుంచి దీనికి సబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తను చివరి తేదీగా ఈ నెల 25 అని పేర్కొన్నారు.

దరఖాస్తు ఫీజు వచ్చేసి.. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదంటూ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష నవంబర్‌/డిసెంబర్‌ 2021లో నిర్వహించనున్నారు. మెయిన్స్ వచ్చేసి.. 2021 డిసెంబర్.. ఇంటర్వ్యూలు 2022 ఫిబ్రవరి2వ లేదా 3వ వారంలో జరగున్నాయి. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ https://bank.sbi/web/careers లో చూసుకోవచ్చు.