సమంత నాగచైతన్య అక్టోబర్ 2 వ తేదీ విడాకులు తీసుకుంటున్నామని అధికారికంగా తెలియజేసిన అప్పటినుంచి చాలా మంది నెటిజన్లు ఈ విడాకులకు కారణాలు ఏంటని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది సమంతను తప్పుపడుతూ విడాకులకు కారణం ఆమె అంటూ తన పై ఎన్నో కథనాలు అల్లుతున్నారు. అయితే నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత సమంత ఎంతటి నరకం అనుభవించిందో ఎవరికీ తెలియదని నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ సమంత ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ సెలబ్రిటీ రేంజ్ కి ఎదిగింది. సమంత కోట్లు సంపాదించిన కానీ తన పాకెట్ మనీ కోసం అక్కినేని కుటుంబం దగ్గర చేతులు చాపేది. అక్కినేని కుటుంబం తనని ఒక కోడలిగా కాకుండా డబ్బు సంపాదించే యంత్రంగా ఉపయోగించుకున్నారని మాధవిలత ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా గతంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమంత తన 30 సంవత్సరాలు వచ్చేసరికి తను తల్లి కావాలని ఆశపడింది. తన ఆశలపై కూడా అక్కినేని కుటుంబం నీళ్లు చల్లిందనే విషయాన్ని మాధవి లత తెలియజేశారు.
ఇకపోతే సమంతకు తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ కి సంబంధం ఉందని లేని పోని సంబంధాలు అంట కడుతున్నారు. సమంతను ప్రీతమ్ అక్క అంటూ తన వెంట తిరిగే వాడని ఇలా వారి మధ్య ఉన్న మంచి రిలేషన్ కు లేని పోని సంబంధాలు అంటకట్టకండి అంటూ మాధవిలత తెలియజేశారు. ఇలా సమంత గురించి మాధవిలత ఎన్నో షాకింగ్ విషయాలు తెలియజేస్తూ ఆమెలో ఉన్న మరో కోణాన్ని బయటపెట్టారు.
ప్రస్తుతం మాధవి లత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అయితే సమంత నిజంగానే నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాక ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారా.. లేక మాధవీలత కల్పితాల అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…