Tag Archives: samantha

Allu Arjun: బన్నీ, అట్లీ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత?

Allu Arjun: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇకపోతే ఈ సినిమా వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాలో నటించబోతున్నాడు అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

అయితే అల్లు అర్జున్ తదుపరి సినిమా ఆ డైరెక్టర్ తోనే అంటూ ఇప్పటికే చాలామంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. కానీ వాటిలో ఏది కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే గత కొద్ది రోజులుగా బన్నీ నెక్స్ట్ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతోనే అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ మూవీ వర్క్ కూడా స్టార్ట్ అయిందని ఇటీవల ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమాతో సమంత రీ ఎంట్రీ ఇస్తున్నారట. ఖుషి సినిమా తరువాత సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అట్లీ సినిమాతో రీ ఎంట్రీ

తన అనారోగ్యం నుంచి కోలుకోవడం కోసం చికిత్స తీసుకుంటూ వస్తున్న సమంత, అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఓకే చెప్పారట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు. కాగా సమంత గతంలో అట్లీ తెరకెక్కించిన మెర్సల్, తేరి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అలాగే ఇక అల్లు అర్జున్‌తో కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది సామ్. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు తన రీ ఎంట్రీకి ఈ హిట్ కాంబినేషన్ అయితేనే పర్ఫెక్ట్ అని సమంత భావించినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని అల్లు అర్జున్ బర్త్ డే నాడు అనౌన్స్ చేయబోతున్నారట. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజునే ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి మేకర్స్ సిద్దమవుతున్నారట.

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Samantha: రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత.. భారీగా పెంచిన రెమ్యూనరేషన్.. ఎంతంటే?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయాసైటిసిస్ కారణంగా ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఈమె ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసేవారు.

ఇక ఈ వ్యాధి కోసం ఎన్నో దేశాలకు తిరిగి చికిత్స తీసుకున్నటువంటి సమంత త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు సినిమా కథలను కూడా వినే పనులలో సమంత బిజీగా ఉన్నారని సమాచారం. ఇక ఈమె చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదేవిధంగా ఈమె సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఈ సిరీస్ త్వరలోనే విడుదల కాబోతోంది.

ఇలా ఇండస్ట్రీలోకి త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి సమంత భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ పెంచుతూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి సమంత కొత్తగా కమిట్ అయ్యే సినిమాలకు కూడా ఆరు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.

రెండు కోట్లు అదనం..
ఈమె ఇది వరకు ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవారు అయితే ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోయినా చేయబోయే సినిమాలకు ఏకంగా 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారనే విషయం తెలిసే అందరూ షాక్ అవుతున్నారు. ఈమె ఇండస్ట్రీకి విరామం ఇచ్చి ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచారని నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారు.

Samantha: సింపతి క్వీన్ అంటూ సమంత  పై ట్రోల్స్… సమంత రియాక్షన్ ఇదే?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సమంత ఒకరు. సమంత మయోసైటీస్ వ్యాధి కారణంగా కొన్ని రోజులపాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే గతంలో యశోద సినిమా సమయంలో ఈమె సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. కానీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన బాధ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత ఇంటర్వ్యూ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకొని ఏడవటంతో చాలామంది ఈమె పట్ల నెగిటివ్ కామెంట్లు చేశారు. సింపతి క్వీన్ అంటూ ట్రోల్ చేశారు.

తాజాగా ఈ ట్రోల్స్ పై సమంత స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చాలామంది నేను కన్నీళ్లు పెట్టుకొని నా బాధను బయటకు చెప్పగా నన్ను ట్రోల్ చేశారు. ఆ సమయంలో నేను పడిన బాధ కష్టం నాకు మాత్రమే తెలుసు. ఇక నేను మయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డాను అనే విషయం చెప్పకపోయి ఉంటే మరింత ఘోరంగా ట్రోల్ చేసేవారు.

ఆ బాధ నాకే తెలుసు…
నా బాధ గురించి ఆలోచించకుండా నన్ను ట్రోల్ చేసిన వారి గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోనని ఈ సందర్భంగా తన పట్ల విమర్శలు చేస్తున్న వారికి కూడా సమంత ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఇక సమంత ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారనే తెలుస్తోంది. త్వరలోనే ఈమె ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి పూర్తిగా సిద్ధమయ్యారని తెలుస్తుంది.

Samantha: ఆ హీరో అంటే సమంతకు అంత క్రష్ ఉందా.. ఎవరా హీరో?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత ప్రస్తుతం కెరియర్ కు కాస్త విరామం ప్రకటించి తన ఆరోగ్యాన్ని కాపాడుకునే పనులలో ఉన్నారు.. సమంత మయోసైటిసిస్ వ్యాధికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఈమె సినిమాలకు కాస్త విరామం ప్రకటించి పూర్తిగా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సమంత ఇండియా టుడే కాన్ క్లేవ్ 2024 న్యూఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికంటే ముందుగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే సమంతకు ఇండస్ట్రీలో క్రష్ ఎవరు అనే విషయాన్ని కూడా ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. నాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి షారుక్ ఖాన్ గారు అంటే ఎంతో గౌరవం అని తెలియజేశారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ప్రభాస్ తో ఇప్పటివరకు ఈమె నటించకపోయినా ప్రభాస్ అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు.

అల్లు అర్జున్..
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ నా క్రష్ అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ నాకు అల్లు అర్జున్ సినీ రోల్ మోడల్ అని చెప్పినటువంటి ఈమె ఇప్పుడు అల్లు అర్జున్ తన క్రష్ అంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Samantha: ఆ ఒక్క కారణంతో మయోసైటిసిస్ గురించి అందరికీ చెప్పాను… సమంత కామెంట్స్ వైరల్!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈమె మయూసైటిస్ అనే వ్యాధికి గురి కావడంతోనే ఈ వ్యాధికి పూర్తిగా చికిత్స తీసుకోవాలనే ఉద్దేశంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. సినిమాలకు దూరమైనటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉన్నారు.

ఇకపోతే తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు తాను ఇండస్ట్రీలోకి వచ్చి 14 సంవత్సరాలు అయింది అని తెలిపారు. అయితే ఈ 14 సంవత్సరాల సమయంలో నేను రోజుకు పది పనులు చేసేదాన్ని కేవలం ఐదు గంటలు మాత్రమే నిద్రపోయే దానిని తెలిపారు. నేనెప్పుడూ నా శరీరానికి విశ్రాంతి ఇవ్వలేదని సమంత ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇలా 14 సంవత్సరాల పాటు నిరంతరం కష్టపడిన ఎప్పుడు నేను విజయాలను ఆస్వాదించలేకపోయానని ఈమె తెలియజేశారు. ఇక తనకు మయోసైటిసిస్ వ్యాధి వచ్చింది అని చెబుతూ ఈమె అందరి దగ్గర సింపతి కొట్టేసింది అంటూ గతంలో కూడా వార్తలు వచ్చే అయితే ఈ వార్తలు గురించి స్పందించారు నేను మాయోసైటిస్ గురించి చెప్పడానికి కారణం లేకపోలేదని తెలిపారు.

చెప్పకపోతే సినిమా చచ్చిపోతుంది..
ఆ సమయంలో నేను ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేశాను. ఈ వ్యాధి కారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉన్నాను అయితే నేను ప్రమోషన్లకు దూరంగా ఉండడంతో ఈ సినిమా చచ్చిపోతుందని నిర్మాతలు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితులలో నా అనారోగ్య సమస్యలను బయట పెట్టాల్సి వచ్చిందంటూ ఈ సందర్భంగా సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Samantha: నేను కోరుకోలేదు.. ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు..సమంత ఎమోషనల్ కామెంట్స్!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో నటి సమంత ఒకరు. ఈమె ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ గత 14 సంవత్సరాలుగా అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్నారు అయితే ఇటీవల సమంత సినిమాలకు దూరమైన సంగతి మనకు తెలిసిందే. సమంతకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యల కారణంగా చిన్న విరామం ఇచ్చారు.

ఈ విధంగా సమంత సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇకపోతే ఈమె ఇప్పుడు సమస్యల నుంచి కోలుకున్నారని తెలుస్తుంది. ఇలా ఈ వ్యాధి నుంచి సమంత కోలుకోవడంతో తిరిగి సినిమాలలోకి రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇకపోతే ఇటీవల సమంత తన అనారోగ్య సమస్యల గురించి పలు విషయాలను వెల్లడించారు. అయితే తాజాగా ఇండస్ట్రీకి విరామం ఇవ్వడం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీకి ఏడాది పాటు విరామం ఇవ్వాలన్నది చాలా కఠినమైనటువంటి నిర్ణయం అయితే ఈ విషయం గురించి సమంత మాట్లాడుతూ…

ఆరోగ్యమే ముఖ్యం..
నేను ఇండస్ట్రీకి విరామం ఇవ్వాలని అసలు అనుకోలేదు కానీ అలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా కెరియర్ కంటే ఆరోగ్యమే నాకు ముఖ్యం. ఇకపై జీవితంలో ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నా అంటూ సమంత పేర్కొంది. నేను బ్రేక్ తీసుకుంది సమయం వృధా చేయడానికి కాదు. నా ఆరోగ్యం కోసమే. దీని కోసం చాలా అవకాశాలు వదులుకోవాల్సి వస్తుందనే విషయం నాకు తెలుసు కానీ తప్పలేదు అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Samantha: ఆ స్టార్ హీరోనే నా యాక్టింగ్ రోల్ మోడల్.. సమంత కామెంట్స్ వైరల్?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగినటువంటి సమంత ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యల కారణంగా సినిమా ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు అయితే తాజాగా ఇటీవల ఒక కాలేజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఈమె అక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక విద్యార్థి సమంతను ప్రశ్నిస్తూ మీకు యాక్టింగ్ లో రోల్ మోడల్ ఎవరు అనే ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ తనకు యాక్టింగ్ లో రోల్ మోడల్ అల్లు అర్జున్ అని తెలియజేశారు. ఆయనతో కలిసి నేను మరో సినిమాలో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎందుకంటే ఆయన నటనలో చాలా ట్రాన్స్ఫర్ అయ్యారు అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ నా రోల్ మోడల్..
ఇక సమంత అల్లు అర్జున్ ఇద్దరు కలిసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించారు. అదేవిధంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి కూడా తాను అల్లు అర్జున్ తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఈ సందర్భంగా సమంత చెప్పడంతో బన్నీ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FTrendsAlluArjun%2Fstatus%2F1764591259686199610&widget=Video

Samantha: చైతన్య సమంత ఫస్ట్ లవ్ కాదా… ఫస్ట్ లవ్ స్టోరీ బయటపెట్టిన సమంత?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు. ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పుష్కరకాలం పూర్తి అవుతున్న ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈమే సినిమాలో వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా మాయోసైటిసిస్ వ్యాధికి గురయ్యారు.

ఈ వ్యాధి కారణంగా ఈమె సినిమాలకు కాస్త విరామం ఇచ్చి ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి బయటపడే మార్గాలను వెతుకుతూ పలు దేశాలకు వెళుతూ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ వ్యాధి నుంచి సమంత క్రమక్రమంగా బయటపడుతున్నారని తిరిగి ఈమె ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంతా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా సమంత తన ఫస్ట్ లవ్ గురించి బయట పెట్టారు. సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల విడిపోయారు అయితే నాగచైతన్య కంటే ఈమె ముందు మరొకరిని ప్రేమించారు అంటున్న ప్రేమ గురించి బయటపెట్టారు తను స్కూల్ చదువుతున్న రోజులలో ఒక బస్సు మారి స్కూల్ కి వెళ్లాల్సి ఉండేదని తెలిపారు.

రెండేళ్లు వెంటపడ్డాడు..
ఇలా బస్ స్టాప్ లో ప్రతిరోజు ఒక అబ్బాయి తనని రెండు సంవత్సరాల పాటు ఫాలో అవుతూ వచ్చారని అయితే ఎప్పుడు దగ్గరకు రాలేదు కానీ తనని ఫాలో అయ్యే వాడిని తెలిపారు. ఇలా ఒకరోజు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అంటే నేను నిన్ను ఫాలో కావడం ఏంటి అనేసారు దీంతో నేను షాక్ అయ్యానని మరి అది ప్రేమ కాదా అనేది నాకు తెలియదు కానీ నాకు మాత్రం అదే ఫస్ట్ లవ్ స్టోరీ అంటూ తన ఫస్ట్ లవ్ బయటపెట్టారు.

Samantha: బికినీలో రచ్చ చేసిన సమంత.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫోటో?

Samantha: సమంత పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగినటువంటి సమంత ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈమె మయోసైటిస్ వ్యాధికి గురి కావడంతో కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించారు. ఇలా విరామం తీసుకున్నటువంటి సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

సోషల్ మీడియా వేదికగా సమంత తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఈమె ఆ వ్యాధి కోసం వివిధ దేశాలకు వెళ్తూ ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో సమంత ఎక్కువగా ప్రకృతికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే సమంత తాజాగా మలేషియా వెళ్లారు. ఇలా మలేషియా వెళ్ళినటువంటి ఈమె అక్కడ కూడా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రకృతి అందాల నడుమ పారుతున్నటువంటి సెలయేరులో బికినీ వేసుకొని ఈమె జలకలాడుతూ కనిపించారు.

మిలియన్ సంఖ్యలో వ్యూస్..
ఈ విధంగా సమంత చాలా రోజుల తర్వాత బికినీలో దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ ఫోటో షేర్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఏకంగా మిలియన్స్ సంఖ్యలో వ్యూస్ రావడమే కాకుండా లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ఇలా సమంత బికినీలో ఉన్నటువంటి ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.