టాలీవుడ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ సినిమాల్లో ఎక్కువగా నటించి అడివి శేష్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఈ హీరో సినిమా రంగంలో అబ్బాయిలను కూడా హోటల్ గదుల్లోకి పిలుస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇండస్ట్రీలో మేల్ క్యాస్టింగ్ కౌచ్ కూడా ఉంటుందని అడివి శేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలో రణవీర్ సింగ్ తాను అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నానని చెప్పగా తాజాగా మరో హీరో ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అడివి శేష్ తను హీరోగా తెలుగులో తెరకెక్కిన క్షణం సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకున్నాడట. అయితే రీమేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కమిట్మెంట్ కావాలని అడగడంతో అడివి శేష్ అవక్కయ్యాడట.

అడివి శేష్ ను కమిట్మెంట్ అడిగిన వ్యక్తి లేడీ కావడం గమనార్హం. ఒక యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో అడివి శేష్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆ లేడీ కమిట్మెంట్ అడిగిన తరువాత ఆ ప్రపోజల్ ను సున్నితంగా తిరస్కరించిన అడివి శేష్ హైదరాబాద్ కు తిరిగి వచ్చారట. ఇలా తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి ఎవరికీ తెలియని కీలక విషయాలను అడివి శేష్ వెల్లడించారు.

ఇలాంటి అనుభవాలు అడివి శేష్ తో పాటు చాలామంది నటులకు ఎదురయ్యాయని అయితే చాలామంది ఆ విషయాన్ని బయటపెట్టడానికి ఇష్టపడరని తెలుస్తోంది. ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తుండగా త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here