నోరూరించే స్వీట్ కార్న్ రైస్ తయారు చేయడం ఎలా… !!

    0
    2558

    స్వీట్ కార్న్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు :

    • స్వీట్ కార్న్- 1 కప్పు.
    • ఉడికించిన అన్నం – 2 కప్పులు.
    • ఉల్లిపాయలు – 1 మీడియం సైజ్.
    • అల్లం, వెల్లుల్లి పేస్ట్ – కొద్దిగా.
    • మసాలా దినుసులు – 4 లవంగాలు,యాలకులు, కొద్దిగా సజీర, ఒక బిర్యాని ఆకు సువాసన కోసం.
    • కారం – కొద్దిగా.
    • పసుపు – చిటికెడు.
    • నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్.
    • ఆయిల్ – 1 టేబుల్ స్పూన్.
    • ఉప్పు – రుచికి సరిపడినంత.
    • కొత్తిమీర – కొద్దిగా

    తయారీ విధానం:
    ముందుగా స్వీట్ కార్న్ ని బాగా ఉడికించుకోవాలి, అన్నం కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి మరియు ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక అందులో మసాలా దినుసులు వేసి వేయించాక, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టాలి. ఇలా ఉప్పు వేసి మూత పెడితే ఉల్లిపాయలు త్వరగా ఉడుకుతాయి. ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో చిటికెడు పసుపు వేసి కలపాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఈ పేస్ట్ కూడా వేగిన తర్వాత కొద్దిగా కారం వేసి కలిపి, ఆ తర్వాత ఉడక పెట్టిన స్వీట్ కార్న్ వేసి కలిపి కాసేపు మూత పెట్టాలి. కాసేపటి తరువాత మూత తీసి ఉడికించిన అన్నం వేసి కలపాలి. అన్ని పదార్థాలు కలిసేలా బాగా కలిపాక ఉప్పు చూసుకొని రుచికి సరిపడా వేసుకోవాలి, దాని పైన కొత్తమీర చల్లు కొని స్టౌ ఆఫ్ చేస్తే వేడి వేడి స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోతుంది.

    స్వీట్ కార్న్ లో పీచు పదార్థం ఎక్కువ గ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది పిల్లలు స్వీట్ కార్న్ తినడానికి ఇష్ట పడరు, పిల్లలకు ఇలా రైస్ రూపంలో చేసి పెడితే ఎంతో రుచి గా మరియు ఆరోగ్యంగా కూడా ఉంటుంది.