ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిల సీజన్ నడుస్తోంది. వరుసగా సినీ ప్రముఖులంతా ఒకరి తర్వాత ఒకరు దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్నారు. మొన్న హీరోలు నిఖిల్, నితిన్ నుంచి నిన్న రానా దగ్గుబాటి వరకు పెళ్లి పీటలు ఎక్కిన తెలిసిందే.. తాజగా మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా చైతన్య జొన్నలగడ్డతో తన ఎంగేజ్మెంట్ చాలా సింపుల్‌గా చేసుకుంది. ఈ వేడుకలో నిహారిక పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి సహా బంధుమిత్రులందరి సమక్షంలో ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది.






